Kohli: డీఆర్ఎస్ నిర్ణ‌యంపై కోహ్లీ ఆగ్ర‌హం.. థ‌ర్డ్ అంపైర్‌ని దూషించిన విరాట్

Kohli: భార‌త్- ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రుగుతున్న మూడో టెస్ట్ ర‌స‌వత్త‌రంగా సాగుతుంది. ఈ మ్యాచ్ ఎలాగైన గెలిచి చ‌రిత్ర సృష్టించాల‌ని టీమిండియా భావిస్తుండ‌గా, ద‌క్షిణాప్రికా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. మూడో రోజు ఆట‌లో 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 రన్స్ చేసింది. సౌతాఫ్రికా విజయానికి 111 పరుగులు అవసరం కాగా.. భారత్ విజయానికి 8 వికెట్లు కావాలి.

Kohli
Kohli

ఇక ఓపెనర్ ఎయిడెన్ మార్క్‌రమ్(16) విఫలమవ్వగా.. కీగన్ పీటర్సన్(48 బ్యాటింగ్), డీన్ ఎల్గర్(30) రెండో వికెట్‌కు 78 పరుగులు జోడించారు. ఇక ఎల్గర్‌ను ఔట్ చేయడంతో మూడో రోజు ఆట ముగిసింది. అంతకుముందు 57/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 198 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(100 నాటౌట్) అజేయ సెంచరీతో చెలరేగాడు

భారత్- సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో టెస్ట్‌లో డీఆర్‌ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా భారత్‌కు ప్రతికూలంగా వచ్చిన ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెక్నాలజీపైనే క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఫీల్డ్ అంపైర్ కూడా థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

దూకుడుకు మారుపేరైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అయితే స్టంప్స్ మైక్ దగ్గరకు వెళ్లి థర్డ్ అంపైర్ నోరుపారేసుకున్నాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ సౌతాఫ్రికా అధికారిక బ్రాడ్‌కాస్టర్ సూపర్ స్పోర్ట్స్‌పై మండిపడ్డాడు. స్టంప్స్ మైక్స్ వద్దకు వెళ్లి మరి తిట్టాడు. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా అశ్విన్ వేసిన 21వ ఓవర్‌లో డీన్ ఎల్గర్ వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఈ ఓవర్ నాలుగో బంతిని డిఫెన్స్ చేసే ప్రయత్నం చేసాడు. కానీ మిస్సయ్యిన బంతి అతని ప్యాడ్లను తాకింది. దాంతో భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ఇక బ్యాట్ తాకిందనే సందేహంతో ఎల్గర్ రివ్యూ తీసుకోగా.. టీవీ రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. బాల్ ట్రాకింగ్‌లో బంతి బౌన్స్ అయ్యి వికెట్లను మిస్సయ్యిందని తెలింది. దాంతో థర్డ్ అంపైర్ నాటౌటివ్వగా.. ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు.

Kohli
Kohli

ఈ నిర్ణ‌యంపై విరాట్‌ కోహ్లీ, అశ్విన్ సహనం కోల్పోయి స్టంప్స్ మైక్ ముందు వెళ్లి నోరుపారేసుకున్నారు. ‘మ్యాచ్ గెలవడానికి మంచి మార్గాలను ఎంచుకోండి.. సూపర్ స్పోర్ట్(అధికారిక బ్రాడ్‌కాస్టర్)’అంటూ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ‘ప్రత్యర్థిపైనే కాకుండా సొంత జట్టుపై కూడా ఓ లుక్ వేయాలని’కోహ్లీ అన్నాడు.