Sunil Shetty: సునీల్కే, ఎల్ రాహుల్‌ అతియాల‌ది చూడ‌ముచ్చ‌టైన జంట‌

Sunil Shetty: క్రికెట‌ర్స్ క‌థానాక‌య‌ల బుట్ట‌లో ప‌డ‌డం కామ‌న్‌గా మారుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో చాలా మంది క్రికెట‌ర్స్ సినిమా స్టార్స్‌ని వివాహం చేసుకున్నారు. ఈ క్ర‌మంలో టీమిండియా బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ..బాలీవుడ్ న‌టి అతియా శెట్టి ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని, వారి పెళ్లి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నుందని కొన్నాళ్లుగా అనేక వార్త‌లు వ‌స్తున్నాయి.

KL Rahul, Atiyaladi
KL Rahul, Atiyaladi

వీళ్లిద్ద‌రూ దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ నోరు విప్ప‌క‌పోయినా.. అప్పుడ‌ప్పుడూ క‌లిసి క‌నిపిస్తుండ‌టం, సోష‌ల్ మీడియాలో ఫొటోలు చ‌క్క‌ర్లు కొడుతుండ‌డం వీళ్ల మ‌ధ్య బంధాన్ని బ‌య‌ట‌పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అతియా.. రాహుల్‌తో క‌లిసి ఇంగ్లండ్‌లోనే ఉంది. కానీ ఆమె తండ్రి, బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి మాత్రం మ‌రో ర‌కంగా చెబుతున్నాడు.

కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం టెస్టు సిరీస్‌ నిమిత్తం ఇంగ్లండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. క్రికెటర్స్ తమ భార్య‌ల‌ని లేదా ప్రియురాలిని తమ‌తో పాటు తీసుకెళ్ల‌నున్న‌నేప‌థ్యంలో రాహుల్‌ అతియాను తన పార్ట్‌నర్‌గా పేర్కొంటూ పర్మిషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రాహుల్,అతియా త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో అతియా శెట్టి తండ్రి, బాలీవుడ్‌ ప్రముఖ నటుడు సునీల్‌ శెట్టి తన కూతురు ఇంగ్లండ్‌లో ఉందని కన్‌ఫాం చేసేశాడు.

అతియా ఇంగ్లండ్‌లో ఉన్న మాట వాస్త‌వ‌మే కాని, తను అహాన్‌(అతియా సోదరుడు)తో ఉంది. వాళ్లిద్దరూ అక్కడ సెలవులను ఎంజాయ్‌ చేస్తున్నారు. మిగతా విషయాలు మీకు తెలిసే ఉంటాయి’’ అని పేర్కొన్నాడు. ‘‘ప్రముఖ ఇంటర్నేషనల్‌ బ్రాండ్ రాహుల్‌- అతియాల‌ని అంబాసిడర్లుగా నియమించుకుంది. నిజానికి వాళ్లిద్దరూ చూడక్కని జంట కదా. కాదంటారా? అందుకే యాడ్‌ అంతబాగా వచ్చింది. ఇక రిలేషన్‌ గురించి చెప్పాల్సి వ‌స్తే ఈ విష‌యాన్ని వారినే అడిగితే స‌రి అంటూ సునీల్ శెట్టి న‌వ్వులు చిందించాడు.

రాహుల్‌- అతియా ‘నుమి ప్యారిస్’ అనే లగ్జరీ గాగుల్స్ యాడ్‌లో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. గ‌తేడాది కూడా కేఎల్ రాహుల్‌పై సునీల్ శెట్టి ప్ర‌శంస‌లు కురిపించాడు. వాళ్లిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారు. వాళ్లు హ్యాపీగా ఉండ‌ట‌మే మాకు కావాలి. మేము సంతోషంగా ఉన్నాం అని అన్నాడు.