Kiara Advani: కైపెక్కించే అందాల‌తో కేక పెట్టిస్తున్న కియారా

Kiara Advani: భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని.ఈ అమ్మ‌డు భ‌ర‌త్ అనే నేను సినిమా త‌ర్వాత విన‌య విధేయ రామ చిత్రంలో న‌టించింది. ఈ సినిమా ఫ్లాప్ కావ‌డంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డే సినిమాలు చేసుకుంటూ స్టార్ స్టేట‌స్ అందుకుంది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న మ‌రోసారి న‌టించేందుకు సిద్ద‌మైంది.

Kiara Advani Latest Photoshoot
Kiara Advani Latest Photoshoot

శంక‌ర్- రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో కియారా అద్వాని న‌టిస్తుండ‌గా, ఇటీవ‌ల ఈ అమ్మడు పూజా కార్య‌క్ర‌మానికి కూడా హాజ‌రైంది. సూటు బూటువేసుకొని స‌రికొత్త లుక్‌లో ద‌ర్శ‌నమిచ్చి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

ఈ అమ్మ‌డు గ్లామ‌ర్ షో ఎప్ప‌టికీ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది.బికినీలో ఈ అమ్మ‌డు అందాల ఆర‌బోత చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతుంటారు. లేటెస్ట్ గా ఫోటో షూట్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది కియారా అద్వానీ. ఇందులో వ‌రంక‌వుట్ త‌ర‌హాలో ఫొటోల‌కు ఫోజులిచ్చి కేక పెట్టిస్తుంది. ఇందులో కియారా చూపులు నెటిజన్ల గుండెల్ని తొలిచేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

కియారా అద్వానీ అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు తన అందంతో చెమటలు పట్టిస్తోంది. బికినీ ఫోజుల్లో ఈ అమ్మ‌డు తెగ మెస్మరైజ్ చేస్తోంది. ఇసుక తిన్నెలపై పడుకుని ఓర చూపులతో చూస్తున్న కియార ఈ ఏడాది నెట్టింట తెగ వైర‌ల్ అయిన పిక్స్‌లో ఒక‌టి.

Kiara Advani Latest Photoshoot
Kiara Advani Latest Photoshoot