Kiara Advani: ఎల్లో బికినీలో అందాల‌తో ర‌చ్చ చేస్తున్న కియారా అద్వాని

Kiara Advani: కియారా అద్వాని.. ఈ పేరు తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన ఈ అమ్మ‌డు త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చిత్ర‌వ విన‌య విధేయ‌రామ‌లో కనిపించింది. ఈ సినిమా ఫ్లాప్ టాక్ రావ‌డంతో కియారాకి ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. దీంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్క‌డ వ‌రుస ఆఫ‌ర్స్ అందుకుంటూ రెచ్చిపోతుంది.

Kiara Advani

సినిమాలో బోల్డ్‌ క్యారెక్టర్స్‌తో రెచ్చిపోతున్న కియారా.. రియల్‌ లైఫ్‌లో మాత్రం ట్రెడిషనల్‌ గర్ల్‌నే అని గట్టిగా చెప్పేందుకు ట్రై చేస్తున్నారు. అయితే మాటలు ట్రెడిషనల్‌గానే ఉన్నా.. అమ్మడి అపియరెన్స్ మాత్రం అలా అస్సలు కనిపించటం లేదని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. టాలీవుడ్ లో సైజబుల్ మార్కెట్ వున్న హీరోయిన్ గా కియారా అద్వానీకి నార్త్ లో కూడా బంపరాఫర్లు క్యూ కట్టేశాయి. కట్ చేస్తే.. ఇప్పుడామె రేట్ కార్డు కూడా అదే రేంజ్ లో వుంది. ఐదు కోట్లిస్తేనే చేస్తా అని మొహం మీదే చెప్పేస్తున్నారట.

కియారా.. కబీర్ సింగ్ తర్వాత హాట్ కేక్ అయ్యారు. తర్వాత చేసిన లక్ష్మీ., ఇందు కి జవానీ పెద్దగా నడవకపోయినా.. కియారా జోరు మాత్రం తగ్గలేదు. తెలుగులో ఇప్పుడు అరడజను దాకా భారీ సినిమాలు స్టార్ హీరోయిన్ కోసం వెయిటింగ్ లో వున్నాయి. శంకర్-చరణ్ మల్టీలింగువల్ చిత్రంలోను ఈ అమ్మ‌డినే హీరోయిన్ అని అనుకుంటున్నారు. కోలీవుడ్ లో కూడా కియారా కోసం ఒక బలమైన డెబ్యూ ఛాన్స్ రెడీగా వుందట.

Kiara Advani

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే పాలసీ ఫాలో అవుతున్న కియారా హిందీలోను ఐదారు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉంది. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మ‌డు ప‌ర్స‌న‌ల్ లైఫ్ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. గ‌త ఏడాది త‌న రూమ‌ర్ బాయ్ ఫ్రెండ్‌తో క‌లిసి మాల్దీవుల‌కి వెళ్ల‌గా అక్క‌డ హాట్ హాట్ దుస్తుల‌లో రెచ్చిపోయింది. ఆ స‌మ‌యంలో కియారా షేర్ చేసిన పిక్స్ తెగ వైర‌ల్ అయ్యాయి.

తాజాగా కియారా త‌న ఇన్‌స్టాగ్రాములో ప‌సుపు రంగు బికినీలో దిగిన పిక్ షేర్ చేసింది. పై నుండి కింది వ‌ర‌కు ప‌సుపు దుస్తులలో క‌నిపించి కియారా త‌న లుక్స్‌తో యువ‌త హృద‌యాను దోచుకుంది. కియారాని ఇలా చూసి అంతా మైమ‌ర‌చిపోతున్నారు. బికినీలో అదిరిపోయావు కియారా అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే రీసెంట్‌గా షేర్ చేసిన పిక్ త్రోబ్యాక్ పిక్ కాగా, తాను స‌ముద్రం, ఇసుక‌, బికినీ, సూర్మ‌ర‌శ్మిని మిస్ అవుతున్నానంటుంది. కరోనా కాస్త శాంతిస్తే ఈ అమ్మ‌డు మ‌ళ్లీ మాల్దీవుల‌కి వెళ్లేలా క‌నిపిస్తుంది.