Khiladi : ఖిలాడి టీంలో చేరిన మ‌రో న‌టుడు.. అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన మేక‌ర్స్

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ చాలా కాలం త‌ర్వాత క్రాక్ అనే సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా అందించిన జోష్‌తో రాక్ష‌సుడు ఫేం ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఖిలాడి చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో ర‌వితేజ డ్యూయ‌ల్ రోల్ పోషిస్తున్నాడు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మే 28న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు.

జనవరి 26న గణతంత్య్ర‌ దినోత్సవం రోజు రవితేజ బర్త్‌డే సందర్భంగా ‘ఖిలాడి’ ఫస్ట్‌ గ్లింప్స్‌ని విడుదల చేయ‌గా, ఇందులో రవితేజ చేతులో రాడ్‌ పట్టుకొని తనదైన శైలీలో నడుస్తూ నయా లుక్‌లో అదరగొట్టాడు.ఈ గ్లింప్స్ మూవీపై అంచ‌నాలు పెంచింది. అయితే ఈ చిత్రంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ విల‌న్‌గా క‌నిపించ‌నున్నాడ‌ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచారు. తాజ‌గా మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్ కూడా సినిమాలో న‌టిస్తున్న‌ట్టు తెలిపారు. అత‌నికి చిత్ర బృందం గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పింది. ఇత‌ను అనుష్క న‌టించిన భాగ‌మతి చిత్రంలో ఆమె భ‌ర్త‌గా క‌నిపించి అలరించిన విష‌యం విదిత‌మే. ఈ సినిమా కూడా ర‌వితేజకు మంచి హిట్ అందిస్తుంద‌ని అంటున్నారు.

 

Advertisement