Anasuya ఈ ఏడాది సంక్రాంతి కానుకగా క్రాక్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ఇదే జోష్‌తో రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమా చేస్తున్నాడు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాల పై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
మే 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా, ఈ సినిమాకు సంబంధించి పలు అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకులని థ్రిల్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా అందాల యాంకర్ అనసూయ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలియజేశారు. అనసూయ రాకతో ఈ మూవీ పై మరింత హైప్ పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.