Khiladi : కరోనాతో ఆగిపోయిన సినిమాలు సమ్మర్లో మూకుమ్మడి దాడి చేసేందుకు సిద్దమయ్యాయి. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాలను థియేటర్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి రిలీజ్ డేట్స్ ప్రకటించగా,తాజాగా మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడీ మూవీ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించారు. మే 28న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తే రవితేజ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు.
లాక్డౌన్ తర్వాత వరుస సినిమాలు ప్రేక్షకులని పలకరిస్తుండగా,ఈ ఏడాది క్రాక్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు రవితేజ. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియన్స్‌ను అమితంగా అలరించింది. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టడమే కాక, రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇదే జోష్‌తో రవితేజ ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఇటీవల రవితేజ బర్త్‌డే గిఫ్ట్‌గా గ్లింప్స్ విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్ కు మంచి వినోదాన్ని కలిగిస్తుంది.ఇక ఈ మూవీలో రవితేజను ఢీ కొట్టే విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు.
దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన యాక్షన్ సినిమాలతో యాక్షన్ కింగ్ అనే బిరుదు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ అర్జున్ ఖిలాడీ సినిమాలో నటిస్తుండే సరికి అంచనాలు మరింత పెరిగాయి. కన్నడనాట జన్మించిన అర్జున్…తమిళంలో అగ్రకథానాయకుడిగా ఒక వెలుగు వెలిగాడు. రవితేజ- అర్జున్ కాంబినేషన్లో సినిమా అనే సరికి అభిమానుల అంచనాలు పీక్స్ కు వెళ్ళాయి. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మాణ ఖిలాడీ చిత్ర బాధత్యలు చేపట్టారు. రవితేజ 67వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బాణీలు కడుతున్నారు.