Yash: కేజీఎఫ్ హీరో మంచి మనసు.. కోటిన్నర సాయంతో అందరి మనసులు గెలుచుకున్నాడు

Yash: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ దెబ్బకు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో మహమ్మారి పై పోరాడేందుకు సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. సోనూ సూద్ తో పాటు ప్రియాంక చోప్రా లాంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఏర్పాటు చేసిన ఫండ్ రైజింగ్ కు మంచి ఆదరణ దక్కింది. వీరితో పాటు చిరంజీవి తన వంతు తాను సాయం చేశారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ లు కూడా సోషల్ మీడియా వేదికగా ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో కరోనా బాధితులకు హెల్ప్ చేశారు. ఇంకా ఎంతో మంది స్టార్ హీరో, హీరోయిన్లు కరోనా మీద పోరుకు సిద్ధమయ్యారు. విరాళాల ద్వారా చికిత్స కు ఉపయోగపడేలా పాటు పడుతున్నారు.

yash

ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కన్నడ రాక్ స్టార్ యశ్ చేరారు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న నటుడు యశ్. కరోనా రోగుల కోసం తన వంతు సాయం చేయడం కోసం ముందుకు వచ్చారు. 1.5 కోట్ల రూపాయలు డొనేట్ చేశారు. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ లో పని చేస్తున్న 3000 మంది వర్కర్లకు తన సాయం అందించారు. స్టార్ హీరోలు అంటే కేవలం తమ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసే వారే కాదు.. తమని అభిమానించే వారిని ఆదుకునే వారు కూడా అని ఈ కరోనా సమయంలో నిరూపిస్తున్నారు. కేవలం సినిమాల్లోనే కాదు. రియల్ లైఫ్ లో కూడా హీరోలుగా నిలుస్తున్నారు. వీరు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

yash

ఇక యశ్ సినిమాల విషయానికి వస్తే.. కేజీఎఫ్ సినిమా తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరో యశ్. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 2 ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరో యశ్ నటన ఓ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక లాక్ డౌన్ కారణంగా ఈ సినిమాకి సంబందించిన మరిన్ని పనులు వాయిదా పడ్డాయి. ఇటీవల రిలీజ్ అయిన కేజీఎఫ్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది.