Vaccine: వ్యాక్సిన్‌కు అంత‌గా భ‌య‌ప‌డ్డ ఈ పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎవ‌రు ?

Vaccine: వెండితెర‌పై అద్భుతాలు సృష్టిస్తారు. ప్ర‌జ‌ల‌చే జేజేలు కొట్టించుకుంటారు. రియ‌ల్ లైఫ్‌లో సాధ్యం కానిది రీల్ లైఫ్‌లో చేసి చూపించి ఎంతో గ‌ట్స్ ఉన్న టెక్నీషియ‌న్ అంటూ పేరు ప్ర‌ఖ్యాత‌లు పొందుతారు. కాని వారికి ఫోబియా ఉంటుంది. ఇంజెక్ష‌న్స్ అన్నా లేదంటే పాములు అన్నా,ఎత్తైన ప్ర‌దేశాల‌కు పోవాల‌న్నా కూడా భ‌యం. అలాంటి ఫోబియా కేజీఎఫ్ అనే సినిమాతో సౌత్ సినిమా పరిశ్రమ స్థాయిని పెంచిన క‌న్న‌డ డైరెక్ట‌ర్ ప్రశాంత్ నీల్‌కు ఉంది. కేజీఎఫ్ చిత్రంలో భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేశాడు . వెండితెర‌పై అంత‌గా విధ్వంసృం సృష్టించిన ఈ డైరెక్ట‌ర్ చిన్న సూదికి భ‌య‌ప‌డ‌టాన్ని చూసి నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు..

Vaccine

క‌రోనా నియంత్ర‌ణలో భాగంగా ప్ర‌భుత్వాలు ప్ర‌తి ఒక్క‌రు విధిగా క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ ప్ర‌శాంత్ నీల్‌కి ఆ స‌మ‌యం వ‌చ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న ఫొటోని షేర్ చేస్తూ.. మొత్తానికి వ్యాక్సిన్ వేయించుకున్నాను.. మీరు ఇంకా వేసుకోలేదంటే.. త్వరగా బుక్ చేసుకొని వ్యాక్సిన్ వేసుకోండి.. అందరూ సురక్షితంగా ఉండండి అని కోరారు. అయితే త‌న‌కు వ్యాక్సిన్ వేస్తున్న స‌మ‌యంలో కళ్లు మూసుకుని పక్కకు తిరిగి భ‌య‌ప‌డుతున్న‌ట్టుగా క‌నిపించారు ప్ర‌శాంత్ నీల్‌. ఈ ఫోటోపై కేజీయఫ్ చాప్టర్ 2 నటి రవీనా టాండన్ సెటైర్ వేశారు. ఇది భలే ఫన్నీగా ఉంది ప్రశాంత్.. నువ్ నా వ్యాక్సినేషన్ వీడియో చూడాల్సింది.. అంటూ తను కూడా అంతే అన్నట్టుగా హింట్ ఇచ్చారు. దీనిపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. అవును మేడం మేం ఆ వీడియోను చూడాల్సింది.. అది మా అందరినీ మోటివేట్ చేసి ఉండేదేమో అని అన్నారు.

Vaccine

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రశాంత్ నీల్ ప్ర‌స్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రధాన పాత్రలో సలార్ మూవీ చేస్తున్నారు. ఇందులో ప్రభాస్ నుంచి మరో మాస్ యాంగిల్ ను చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా త‌ర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్ లో మరో మాస్ మూవీ కన్ఫర్మ్ అంటున్నారు అభిమానులు. మ‌రోవైపు ట్రిపుల్ ఆర్ మూవీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే రోజు విషెస్ చెబుతూ కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రశాంత్ నెక్ట్స్ ఫిల్మ్ ఎవరితో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చ‌రణ్‌తోనే ఆ సినిమా అంటూ కొంద‌రు జోరుగా ప్ర‌చారం చేస్తున్నారు.