KGF Chapter 2: బుక్ మై షోలో కేజీఎఫ్ 2 సరికొత్త రికార్డ్..!
NQ Staff - May 28, 2022 / 01:37 PM IST

KGF Chapter 2: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సౌత్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రం కేజీఎఫ్ 2 .యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా మొత్తం భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. అంతేకాదు ఈ క్క సినిమాతో కన్నడ నటుడు యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

KGF Chapter 2 Has Sold The Most Tickets On BookMyShow
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే 1200కోట్ల మార్క్‌ను అధిగమించి రికార్డు సృష్టించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్లో ఈ చిత్రం సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కలెక్షన్లలో ఖాన్, కపూర్లను సైతం వెనక్కి నెట్టి రాఖీ భాయ్ టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఈ సినిమా విజయంలో రవిబస్రూర్ ముఖ్య పాత్ర వహించాడు అనడంలో సందేహమే లేదు. ఈ చిత్రంలో పాటలు గాని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్ళాయి.
రికార్డు స్థాయి వసూళ్లను అందుకున్న ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్ యాప్ బుక్ మై షో లో భారీ రికార్డు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాకి మొత్తం ఇండియన్ వైడ్ ఒక్క బుక్ మై షో లో ఏకంగా 17 మిలియన్ కి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయట. ఇది ఇండియన్ సినిమా దగ్గర అయితే ఒక భారీ రికార్డు అని తెలుస్తుంది. దీనితో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సెన్సేషన్ ని నమోదు చేసిందో అర్ధం చేసుకోవచ్చు.
కేజీఎఫ్ 2 చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్, రవీనా టాండన్ కీలక పాత్రలో నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
త్వరలో కేజీఎఫ్ 3 చిత్రం ప్లాన్ చేస్తుండగా, ఇందులో యష్ నటిస్తాడా లేదంటే మరో హీరోతో తెరకెక్కిస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. కేజీఎఫ్ ఫ్రాంచైజీలో వస్తున్న ప్రతి సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయడం పక్కా అనే ఆలోచనలో అభిమానులు ఉన్నారు