KGF Chapter 2: కేజీఎఫ్‌2 లాభాలు పంచుకోనున్న య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్.. బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తున్న కన్న‌డ సినిమా

NQ Staff - April 19, 2022 / 10:03 PM IST

KGF Chapter 2: కేజీఎఫ్‌2 లాభాలు పంచుకోనున్న య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్.. బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తున్న కన్న‌డ సినిమా

KGF Chapter 2: య‌ష్‌, ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందిన తాజా చిత్రం కేజీఎఫ్‌2. రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దండ‌యాత్ర చేస్తుంది. నేను మీకొక స‌ల‌హా ఇస్తాను.. అత‌నికి మాత్రం అడ్డు నిల‌బ‌డ‌కండి సార్‌..’ ఈ డైలాగ్ ఏ సినిమాలోనిదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన కేజీఎఫ్ 2 చిత్రంలోనిది.

KGF Chapter 2 box office crosses ₹600 crore

KGF Chapter 2 box office crosses ₹600 crore


ఈ డైలాగ్ ఏ ముహూర్తంలో రాశారో తెలియ‌దు కానీ.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సినిమా సాధిస్తోన్న వ‌సూళ్ల‌ను చూస్తుంటే అది నిజ‌మ‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు. సినిమా విడుద‌లై నాలుగు రోజులు అయ్యింది. అయిద‌వ రోజు ర‌న్ అవుతుంది. రోజు రోజుకీ సినిమా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకోవ‌డంలో అస్స‌లు త‌గ్గేదే లే అంటోంది .

నాలుగు రోజుల్లో సినిమా రూ.557 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించ‌టం విశేషం. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల త‌ర్వాత ఆ ఘ‌న‌త‌ను సాధించిన ద‌క్షిణాది చిత్రంగా కేజీఎఫ్ 2 రికార్డుల్లోకి ఎక్కింది. మేకర్స్ ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేసారు . క‌లెక్ష‌న్స్ పొంద‌డంలో విఫలమైతే ప్రభాస్ సలార్ ఇస్తామని మేకర్స్ హామీ ఇవ్వడంతో పంపిణీదారులు భారీ అడ్వాన్స్‌లు చెల్లించారు.

సినిమా బడ్జెట్‌, రెమ్యునరేషన్‌లు గోప్యంగా ఉంచారు.ఫ‌స్ట్ పార్ట్ సూపర్ హిట్ అయిన తర్వాత, ప్రశాంత్ నీల్ బడ్జెట్ పెంచాలని కోరుకున్నాడు మరియు మేకర్స్ దానికి అంగీకరించారు. రాకీ భాయ్‌గా నటించిన యష్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ వ‌చ్చిన లాభాల‌ని షేర్ చేసుకోనున్నారని తెలుస్తుంది.

కేజీఎఫ్ 2 భారీ విజయం సాధించ‌డంతో, అన్ని థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ డీల్‌లు భారీ ధరలకు అమ్ముడ‌య్యాయి. నిర్మాతలు కూడా లాభాలను ప్రశాంత్ నీల్ మరియు యష్‌లతో పంచుకోవడానికి అంగీకరించారు. ఒక చిన్న విరామం తర్వాత, ప్రశాంత్ నీల్ ప్రభాస్ నటించిన సలార్ షూట్‌ను తిరిగి ప్రారంభించనున్నారు . ఈ చిత్రం ఇప్పుడు అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రం కూడా రెండు భాగాలుగా విడుదల కానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ మేకర్స్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.

Read Today's Latest బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us