KGF 2: కేజీఎఫ్2 నుండి మ‌రో క్రేజీ అప్‌డేట్‌..ఇనాయ‌త్ ఖలీల్ లుక్ విడుద‌ల చేసిన మేక‌ర్స్

క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ స్థాయిని పెంచిన చిత్రం కేజీఎఫ్ యాక్ష‌న్ , థ్రిల్ల‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా కేజీఎఫ్ 2 రూపొందుతుంది. ఇందులో యష్, శ్రీనిధి శేట్టి, సంజ‌య్ ద‌త్, రావు ర‌మేష్‌, ర‌వీనా టాండ‌న్, అనంత్ నాగ్, అచ్యుత్ కుమార్, మాల్విక అవినాష్, అర్చన జోయిస్, లక్ష్మణ్, అయ్యప్ప పి శర్మ, హారిష్ రాయ్, దినేష్ మంగళూరు, బి సురేష్, బి ఎస్ అవినాష్, వినయ్ బిడప్ప, యాష్ శేట్టి, గోవిందె గౌడ, తారక్ పొన్నప్ప తదితరులు నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరగందర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రుర్ అందిస్తున్నారు.

దక్షిణాది సినీ పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన కేజీఎఫ్‌కు సీక్వెల్ రూపొందుతుండ‌గా, ఈ సినిమాను జూలైలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కాని క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు వాయిదా ప‌డే అవ‌కాశం క‌నిపిస్తుంది. అయితే చిత్ర నిర్మాణ సంస్థ ఇందులో న‌టించిన న‌టీన‌టుల బ‌ర్త్‌డేల‌ని పుర‌స్క‌రించుకొని పేపర్​ కట్టింగ్​లతో వారి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తుంది. తాజ‌గా మూవీలో ఇనాయత్​ ఖలీల్​ క్యారెక్టర్​ను పోషిస్తున్న బాలకృష్ణ పోస్టర్​ను రిలీజ్​ చేసింది నిర్మాణ సంస్థ. గుర్తుతెలియని ప్రాంతంలో ఇనాయత్​ ఖలీల్​ తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడంటూ క్యాప్షన్​ ఉంచింది. దుబాయ్​లో ఉంటూ ఇండియాపై కన్నేసే గోల్డ్​ స్మగ్లర్ల డాన్​గా ఇనాయత్​ ఖలీల్​ రోల్​ ఉండబోతోంది. సినిమాపై అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.