KGF2: కేజీఎఫ్ 2 అప్‌డేట్.. స‌ర్‌ప్రైజింగ్ లుక్‌లో విల‌క్ష‌ణ న‌టుడు

గ‌త ఏడాది ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లై సంచల‌న విజ‌యం సాధించిన చిత్రం కేజీఎఫ్‌. ఈ సినిమా క‌న్న‌డ ప‌రిశ్ర‌మ స్థాయిని ఎల్ల‌లు దాటేలా చేసింది. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి కొన‌సాగింపుగా కేజీఎఫ్ 2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. య‌ష్ స‌ర‌స‌న శ్రీనిధి శెట్టి న‌టిస్తుండగా, ఇందులో అధీరా అనే విల‌న్ పాత్ర‌లో సంజ‌య్ ద‌త్ న‌టిస్తున్నారు. ర‌వీనా టాండ‌న్, ప్ర‌కాశ్ రాజ్, ఈశ్వ‌రీరావు, రావు ర‌మేష్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై నిర్మాత విజ‌య్ కిర‌గందూర్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు.

కేజీఎఫ్ 2 చిత్రానికి కూడా క‌రోనా ఎఫెక్ట్ ప‌డింది. ఈ మూవీని జూలైలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించినప్ప‌టికీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో అది సాధ్యం కాదు. అయితే వీలున్న‌ప్పుడ‌ల్లా సినిమా అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తున్న మేక‌ర్స్ ఈ రోజు రావు గోపాల్ రావు త‌న‌యుడు రావు ర‌మేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆయ‌న పాత్ర‌కు సంబంధించిన లుక్ ఒక‌టి విడుద‌ల చేశారు. క‌న్నెగంటి రాఘ‌వ‌న్ పాత్ర‌లో రావు ర‌మేష్ లుక్ అదిరింది. ‘నరాచి లైమ్ స్టోన్ కార్పొరేషన్ వెనుక దాగున్న నిజాన్ని బయట పెట్టడంలో రాఘవన్ విజయవంతం అవుతారా?’ ‘సిబిఐకి ఉన్న ఆసక్తి కేజీఎఫ్ మీదనా లేదా రాకీ భాయ్ మీదా?’ అనేది తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే అని అంటున్నారు.