keerthy suresh: మ‌హాన‌టి కోసం లుక్ టెస్ట్‌.. అప్ప‌టి ఫొటోని షేర్ చేసిన కీర్తి సురేష్‌

అందాల భామ కీర్తి సురేష్ ప్ర‌ధాన పాత్ర‌లో నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన చిత్రం మ‌హాన‌టి. సావిత్రి జీవితమాధారంగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్ర‌లో ఒదిగిపోయింది. త‌న న‌ట‌న‌ను చూస్తుంటే జ‌నాల‌కు సావిత్రి గుర్తొచ్చింది. అంత‌లా జీవించేసింది. కీర్తి సురేష్ న‌ట‌న‌కు నేష‌న‌ల్ అవార్డ్ కూడా ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. 2016లో నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన ప‌నులు మొద‌లు పెట్ట‌గా, 2018లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అనేక అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాను ప్రదర్శించగా, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు దక్కాయి.

నేను లోకల్ సినిమా చేస్తున్న సమయంలో కీర్తి సురేష్‌ని మ‌హాన‌టి కోసం సంప్ర‌దించారు మేక‌ర్స్. ఆ స‌మ‌యంలో సావిత్రి పాత్ర‌ను చేస్తానా లేదా అని భ‌య‌ప‌డింట కీర్తి. అయితే ఎంతో క‌ష్ట‌ప‌డి వెండితెర‌పై మ్యాజిక్ చేసింది కీర్తి. తాజాగా త‌న‌కు లుక్ టెస్ట్ పెట్టిన విష‌యాన్ని గుర్తు చేసుకుంది. నాడు కట్టుకున్న చీరను, అక్కడ లుక్ టెస్ట్ చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోను కీర్తి సురేష్ షేర్ చేశారు. హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు.. ఈ ఫోటో వెనకాల ఎన్నో మెమోరీస్ ఉన్నాయ్ అంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం కీర్తిసురేష్ సర్కారు వారి పాట చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఇందులో మ‌హేష్ బాబు లీడ్ రోల్ పోషిస్తున్నారు.