Keerthy Suresh : ఆయనతో కీర్తి సురేష్ పెళ్లి నిజమే.. కానీ!
NQ Staff - January 25, 2023 / 04:38 PM IST

Keerthy Suresh : మహానటి ఫ్రేమ్ కీర్తి సురేష్ ఈ మధ్య కాలంలో హీరోయిన్ గా వరుసగా సినిమాల్లో నటించడం లేదు. తెలుగులో ప్రస్తుతం దసరా సినిమాలో నాని కి జోడిగా హీరోయిన్ గా నటిస్తోంది. చిరంజీవి సినిమాలో కీర్తి సురేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తోంది. కమర్షియల్ పాత్రల కోసం కీర్తి సురేష్ ఎదురు చూస్తుంది అనే ప్రచారం కూడా జరుగుతుంది.
ఆ విషయం పక్కన పెడితే కీర్తి సురేష్ పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కీర్తి సురేష్ పెళ్లి గురించి తమిళ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.
చాలా కాలం నుండి కీర్తి సురేష్ తన స్నేహితుడైన వ్యాపార వేత్తతో రిలేషన్ షిప్ లో ఉందని, ప్రస్తుతానికి ఇద్దరు సహజీవనం చేస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇరు వైపుల కుటుంబ సభ్యులు కూడా వీరి సహజీవనానికి ఓకే చెప్పడంతో కలిసే ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలో ఉన్న మాట వాస్తవమే కానీ పెళ్లి నాలుగు సంవత్సరాల తర్వాత మాత్రమే చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. కీర్తి సురేష్ ప్రియుడికి కేరళలో వందల కోట్లలో వ్యాపారాలు ఉన్నాయని తమిళ మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేస్తున్నాయి.
గతంలో కూడా కీర్తి సురేష్ పెళ్లి మరియు ప్రేమ వ్యవహారం గురించి ప్రచారం జరిగింది. ఆ సమయంలో కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఆ వార్తలను కొట్టి పారేశారు. తాజాగా మరోసారి సహజీవనం వార్తలు వస్తున్నాయి.. ఈ నేపద్యంలో ఆమె కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.