Keerthy Suresh : చెత్త పని చేయబోతున్న కీర్తి సురేష్‌.. ఇక కెరీర్ నాశనమే..!

NQ Staff - March 13, 2023 / 10:24 AM IST

Keerthy Suresh : చెత్త పని చేయబోతున్న కీర్తి సురేష్‌.. ఇక కెరీర్ నాశనమే..!

Keerthy Suresh : కీర్తి సురేష్‌ అంటే మొదటి నుంచి అందరిలో మంచి ఇంప్రెషన్ ఉంది. ఆమె ఎలాంటి వల్గర్ రోల్స్ చేయదు. అంతే కాకుండా ఎలాంటి గ్లామర్ ఎక్స్ పోజింగ్ చేయకుండా మొదటి నుంచి కేవలం నటనను మాత్రమే నమ్ముకుంది కీర్తి. అందుకే ఆమెకు అంతగా ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఆమెను అంతా మహానటి అంటూ కీర్తించే స్థాయికి చేరుకుంది.

కాగా కీర్తి సురేష్ కూడా ఈ నడుమ కాస్త గ్లామర్ డోస్ పెంచింది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఆమెకు కేవలం నటనను నమ్ముకుంటే అవకావాలు రావట్లేదు. అందుకే గ్లామర్ ఎక్స్ పోజింగ్ కు ఓకే చెప్పేసింది. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు గ్లామర్ తో రచ్చ చేస్తూ కుర్రాళ్లకు అందాల విందు పెడుతోంది.

స్టార్ హీరోయిన్లు కూడా..

ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ చెత్త పనికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ఈ నడుమ స్టార్ హీరోయిన్లు ఐటెం సాంగ్స్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. కాగా ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఇదే బాట పట్టింది. ఆమెతో డైరెక్టర్ సుకుమార్ ఓ ఐటెం సాంగ్ చేయించబోతున్నాడంట.

పుష్ప-2 సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి మాస్ స్టెప్పులు వేయడానికి కీర్తి ఒప్పుకుందంట. మొదటి పార్టులో సమంత ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో.. ఇప్పుడు కీర్తి కూడా అదే రేంజ్ లో అందాలను చూపించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో ఆమె ఫ్యాన్స్ వద్దని వారిస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుంటున్న నువ్వు.. ఇలంటి సాంగ్స్ చేస్తే ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుందని చెబుతున్నారు. ఛాన్సులు రాక కెరీర్ నాశనం అవుతుందని హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి ఆమె ఏం చేస్తుందో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us