keerthy suresh: ట్రైల‌ర్‌తో ఆస‌క్తిరేపుతున్న కీర్తి సురేష్‌.. గుడ్ ల‌ఖ్ స‌ఖి ట్రైల‌ర్‌కి అశేష స్పంద‌న‌

keerthy suresh: మహానటి సినిమాతో జాతీయ ఉత్తమ నటి పురస్కారం అందుకున్న కీర్తి సురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. స్టార్ హీరోలతో ఆడిపాడుతూనే ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో వస్తుంది. కీర్తి నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ పెంగ్విన్, మిస్ ఇండియా బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్రంగా నిరాశ‌ప‌రిచగా గుడ్ లక్ సఖి విడుదలకి సిద్ధంగా ఉంది.

keerthy suresh new look in good luck sakhi
keerthy suresh new look in good luck sakhi

‘కీర్తి సురేష్’ మెయిన్ లీడ్ గా నటించిన సినిమా ‘గుడ్ లక్ సఖి’. అయితే, తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ‘మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను’ అంటూ జగపతిబాబు డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్ చాలా బాగుంది. బ్యాడ్ లక్ సఖి నుంచి గుడ్ లక్ సఖిగా ‘కీర్తి సురేష్’ ప్రయాణాన్ని తక్కువ షాట్స్ లో చాలా బాగా ఎలివేట్ చేశారు.

ట్రైలర్ లో ఎమోషన్ కూడా బాగా హైలైట్ అయింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు కూడా ప్రధాన పాత్రల్లో కనిపించి అలరించారు. ఇక ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ‘U’ సర్టిఫైతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నద్ధం అవుతుంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పడిరి నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. చిరంతన్ దాస్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కింది ఈ చిత్రం. .పెంగ్విన్, మిస్ ఇండియా నిరాశపరచడంతో గుడ్ లఖ్ సఖి తో మెప్పించాలి అనుకుంటోంది కీర్తి. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పెద్దగా కలసి రాకపోవడంతో ఇక హీరోయిన్ రోల్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటోంది.

keerthy suresh new look in good luck sakhi1
keerthy suresh new look in good luck sakhi1

ఇప్పటికే కీర్తి సురేష్ సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. అలాగే దసరా మూవీలో నాని కి జోడిగా నటించేందుకు డేట్స్ కేటాయించింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించబోతున్న ప్యాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్ గా నటించాలనుకుంటోందట.