Keerthy Suresh: ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో మెరిసిన మ‌హాన‌టి.. ఫొటోలకు ప్ర‌తి ఒక్క‌రు ఫిదా

Keerthy Suresh: నేను శైలజ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. మహానటి సినిమా తర్వాత ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. ఆ మధ్య వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది ఈ చిన్నది. లాక్ డౌన్ సమయంలో గ్యాప్ లేకుండా రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది కీర్తి.

TheNewsQube-
Keerthy Suresh Latest Yellow Saree Stills
Keerthy Suresh Latest Yellow Saree Stills

గుడ్ లక్ సఖి అనే సినిమాతో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్న కీర్తి సురేష్ కొన్ని సంవత్సరాలవరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తోందట. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారువారి పాట సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది కీర్తి. అలాగే నాని నటిస్తున్న వైవిధ్యమైన మూవీ దసరాలో నటిస్తుంది కీర్తిసురేష్.

Keerthy Suresh Latest Yellow Saree Stills
Keerthy Suresh Latest Yellow Saree Stills

మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాత్తే, సాని కాయధమ్, మెగాస్టార్ భోళాశంకర్ వంటి సినిమాలలో చెల్లెలి పాత్రలు కూడా చేస్తోంది. కీర్తి సురేష్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు ఓ మీడియా ఛానెల్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది.కీర్తి సురేష్ తో ఓ ట్రెండీ టాక్ షో ప్లాన్ చేస్తున్నారట. సెలబ్రిటీ టాక్ షో లాగా ఇది ఉంటుందని తెలుస్తుంది.ఈమధ్య ఓటీటీల్లో పాపులర్ అయిన ఈ టాక్ షోలను ప్రముఖ ఛానెల్ లో ప్లాన్ చేస్తున్నారట.

Keerthy Suresh Latest Yellow Saree Stills
Keerthy Suresh Latest Yellow Saree Stills

మొత్తానికి కీర్తి సురేష్ కూడా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వస్తుందని చెప్పొచ్చు. సిల్వర్ స్క్రీన్ పైనే కాదు స్మాల్ స్క్రీన్ పైన కూడా మహానటి టాలెంట్ చూపించేందుకు రెడీ అవుతుంది. అయితే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్‌ అప్పుడప్పుడు క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

Keerthy Suresh Latest Yellow Saree Stills
Keerthy Suresh Latest Yellow Saree Stills

తాజాగా ఎల్లో క‌ల‌ర్ డ్రెస్‌లో కీర్తి సురేష్ మెరిసిపోయింది. కీర్తి క్యూట్ లుక్స్ చూసి మంత్ర‌ముగ్ధుల‌వుతున్నారు. బుట్ట‌బొమ్మ మాదిరిగా కీర్తి సురేష్ ఎంత క్యూట్‌గా క‌నిపిస్తుంది అంటూ నెటిజన్స్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.