Keerthy Suresh : చెత్త కండీషన్లు పెడుతున్న కీర్తి సురేష్.. ఇక కెరీర్ సర్వనాశనమే..!
NQ Staff - February 18, 2023 / 09:46 AM IST

Keerthy Suresh : హీరోయిన్ కీర్తి సురేష్ కు మహానటిగా మంచి గుర్తింపు ఉంది. ఆమె అందాలకు, నటనకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ఆమె తలచుకుంటే ఇప్పటికే సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగేది. ఆమె మొదట్లో అందాల ఆరబోతకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కేవలం తన నటనను మాత్రమే నమ్ముకుంది. అందుకే ఆమెకు చాలా తక్కువ సమయంలోనే భారీ ఫాలోయింగ్ సొంతం అయింది.
ఇక మహానటి సినిమాతో ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఆమెకు.. అవకాశాలు పెద్దగా రాలేదు. ఎందుకంటే ఆమెకు ఆమె పెట్టుకున్న కొన్ని కండీషన్లే కారణం. ఆమె అందాలను ఆరబోయకుండా ఉండటంతో చాలా వరకు ఆమెకు ఛాన్సులు రాలేదు. అయితే మహేశ్ బాబు సినిమాలో మాత్రం అందాల గేట్లు ఎత్తేసింది. దాంతో తాను అందాలను ఆరబోయడానికి రెడీ అన్నట్టు హింట్ ఇచ్చేసింది.
సీనియర్ హీరోలతో మాత్రమే..
ఆ మూవీ కూడా పెద్ద హిట్ కావడంతో తనకు భారీ ఆఫర్లు వస్తాయని ఆశ పడింది. కానీ ఇప్పుడు ఆమెకు అసలు ఛాన్సులే రావట్లేదు. ఇంకా చెప్పాలంటే యంగ్ హీరోల సినిమాల్లో ఆమెకు అస్సలు ఆఫర్లు రావట్లేదు. కేవలం సీనియర్ హీరోల సినిమాల్లో మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఇందుకు ఆమె పెట్టుకున్న కొన్ని కండీషన్లే కారణం అని తెలుస్తోంది.
తాను కేవలం స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే నటిస్తాననే కండీషన్ పెట్టుకుందంట. అందుకే ఆమెకు యంగ్ హీరోల సినిమాల సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేయట్లేదు. ఆమె ఆశించినట్టు స్టార్ హీరోలు మాత్రం ఛాన్సులు ఇవ్వట్లేదు. ఇంకొన్ని రోజులు ఇలాగే అయితే ఆమెకు అసలు ఛాన్సులు రావడం కష్టమే అంటున్నారు. ఆమె ఇప్పటికైనా మేల్కొని మంచి కథలను చూసుకుని యంగ్ హీరోల సినిమాల్లో చేస్తే బెట్ అంటున్నారు ఆమె ఫ్యాన్స్.