Keerthy suresh: వైట్ డ్రెస్‌లో క్యూట్ క్యూట్‌గా క‌నిపిస్తున్న కీర్తి సురేష్‌.. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా

Keerthy suresh: కీర్తి సురేష్‌.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ, ఆ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఇక ఈ భామ తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట లో నటిస్తోంది.

TheNewsQube-
keerthy suresh cute photoshoot3
keerthy suresh cute photoshoot3

మ‌రోవైపు కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది.ఈ సినిమా ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డుతూ వ‌స్తుంది.

keerthy suresh cute photoshoot2
keerthy suresh cute photoshoot2

నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన‌ `గుడ్ లక్ సఖి` సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి.

keerthy suresh cute photoshoot1
keerthy suresh cute photoshoot1

ఇటీవ‌ల ఈ ముద్దుగుమ్మ క‌థానాయిక‌గా న‌టిస్తూనే మ‌రోవైపు చెల్లెలి పాత్ర పోషిస్తుంది. ఓ వైపు తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో… మరో వైపు టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవితో.. సినిమా ఛాన్స్‌ కొట్టేసి టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీస్‌గా నిలిచారు. ఇద్దరు లెజెండ్స్‌తో స్క్రీన్‌ షేర్ చేసుకుని లక్కీ గార్ల్‌గా అందరి చేత అనిపించుకుంటున్నారు ఈ ముద్దుగుమ్మ.

keerthy suresh cute photoshoot
keerthy suresh cute photoshoot

అన్నాత్తే సినిమాలో రజినీ చెల్లెలుగా అదరగొట్టిన ఈ బ్యూటీ… తాజాగా చిరు లేటెస్ట్ మూవీ భోళా శంకర్‌‌లోనూ.. చెల్లి క్యారెక్టర్‌ కే పరిమితమైంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోను కీర్తి సురేష్ ర‌చ్చ చేస్తుంది. తాజాగా వైట్ డ్రెస్‌లో క్యూట్ అందాల‌తో కేక పెట్టిస్తుంది. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.