Keerthy Suresh : కీర్తి సురేష్ మ‌స్త్ చిల్ అవుతుందిగా… చ‌క్క‌ర్లు కొడుతున్న ఫొటోలు

Keerthy Suresh : నేను శైల‌జ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమై, మ‌హాన‌టితో అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ అమ్మ‌డు స్లో అండ్ స్ట‌డీగా ముందుకు సాగుతుంది. చివ‌రిగా ర‌జ‌నీకాంత్ అన్నాత్తెతో ప్రేక్ష‌కుల‌ని పల‌క‌రించింది. ఇందులో ర‌జ‌నీ చెల్లెలుగా న‌టించింది.

ఇప్పుడు భోళా శంక‌ర్ చిత్రంలోను చిరంజీవి చెల్లెలుగా న‌టిస్తుంది కీర్తి. మ‌రో వైపు స‌ర్కారు వారి పాట చిత్రంలో మ‌హేష్‌కి జోడి క‌డుతుంది. ఇందులో క‌ళావ‌తి పాత్ర పోషిస్తుంది.తాజ‌గా కీర్తి సురేష్‌కి సంబంధించిన కొన్ని క్యూట్ లుక్స్ బ‌య‌ట‌కు రాగా, అవి అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి.లుక్స్ చాలా కూల్‌గా ఉన్నాయి.

కీర్తి సురేష్ ఈ మ‌ధ్య చాలా స‌న్న‌బ‌డింది. ఆమె స‌న్న‌బ‌డ‌డంపై భిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. కొందరు అప్పుడే బాగుంది అంటే, మరికొందరు ఇప్పుడే బాగుంది అంటున్నారు. ఏది ఏమైనా కీర్తి మాత్రం సన్నబడిన శరీరంలో సరికొత్తగా కనిపిస్తున్నారు. ఆమె నయా లుక్ కొత్త అనుభూతిని పంచుతుంది.

గ్లామర్ ఫీల్డ్ లో ఎంత సన్నగా ఉంటే అంత మంచిది. సన్నగా నాజూగ్గా ఉండడం కోసం హీరోయిన్స్ కఠిన కసరత్తులు, యోగాసనాలు చేస్తారు. ఇష్టమైన ఫుడ్ కూడా వదులుకొని మితంగా తింటూ కడుపు మాడ్చుకుంటారు. పరిశ్రమలో ఎక్కువ కాలం ఉండాలంటే తప్పదు మరి. ఒక్కసారి బరువు పెరిగి షేప్ ఔట్ అయితే ఇంకా కెరీర్ ఖతమే. దర్శక నిర్మాతలు చూడను కూడా చూడరు.

స్లిమ్ అయిన త‌ర్వాత కీర్తికి బాగానే ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ మూవీ మరక్కార్ లో కూడా కీర్తి హీరోయిన్ చేస్తున్నారు. తెలుగులో కూడా భారీగా విడుదలవుతున్న ఈ పీరియాడిక్ చిత్రంపై అంచనాలు బాగా ఉన్నాయి. ఇక గుడ్ లక్ సఖి టైటిల్ తో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ స్పోర్ట్స్ డ్రామా విడుదలకు సిద్ధంగా ఉంది.