Keerthy Suresh: యాంక‌ర్ అవ‌తారం ఎత్త‌బోతున్న మ‌హాన‌టి.. ఇదెక్క‌డి ట్విస్ట్‌

Keerthy Suresh: మ‌హాన‌టి సినిమాతో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ అందుకున్న‌కీర్తి సురేష్ జాతీయ స్థాయి అవార్డ్ కూడా అందుకుంది.ఆ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతోంది. అయితే ఇంతవరకు మహానటిని మరిపించే మూవీని మాత్రంఅందించలేకపోయింది కీర్తి సురేశ్‌. మహానటి దారిలోనే మరిన్ని ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసినా పెద్దగా కలసి రాలేదు.

TheNewsQube-
Keerthy Suresh as Host in TV Show
Keerthy Suresh as Host in TV Show

మొదట్లో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి చిత్రాలు చేసింది. వీటిల్లో గుడ్ లక్ సఖీ వచ్చే నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.పెంగ్విన్, మిస్ ఇండియా నిరాశపరచడంతో గుడ్ లఖ్ సఖి తో మెప్పించాలి అనుకుంటోంది కీర్తి. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పెద్దగా కలసి రాకపోవడంతో ఇక హీరోయిన్ రోల్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటోంది.

ఇప్పుడు ఈ అమ్మ‌డు న‌టిగానే కాకుండా యాంక‌ర్‌గా కూడా అలరించే ప్ర‌య‌త్నం చేయాల‌ని అనుకుంటుంది.ఇప్ప‌టికే జూనియ‌ర్ ఎన్టీఆర్ బుల్లితెర‌పై సైతం స‌త్తా చాటుతున్నాడు. నాగార్జున బిగ్‌బాస్ తో తెలుగు ప్రేక్ష‌కుల గుండెల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి కూడా టీవీ షోతో మెప్పించాడు. రానా, త‌మ‌న్నా, స‌మంత కూడా యాంక‌ర్‌గా మారి టాక్ షోల‌తో అల‌రించారు. ఎవరూ ఊహించని విధంగా బాలకృష్ణ కూడా త్వరలోనే యాంక‌ర్‌ అవతారం ఎత్తుతున్నాడు.

ప్ర‌ముఖ ఛానల్‌లో త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఒక కార్య‌క్ర‌మానికి కీర్తి సురేశ్ యాంక‌రింగ్ చేయ‌బోతోంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా నాలుగు భాష‌ల్లో భారీ స్థాయిలో ఈ షో మొద‌లుపెడుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో కీర్తి సురేశ్ కేవ‌లం హోస్ట్‌గానే కాకుండా.. గేమ్స్ ఆడిస్తూ.. వ‌చ్చిన గెస్ట్‌ల‌తో ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలు కూడా చేయ‌బోతోన్న‌ట్లు తెలుస్తోంది.

అయితే ఈ కార్య‌క్రమానికి కీర్తి సురేశ్ భారీగానే పారితోషికం తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఒక్కొక్క ఎపిసోడ్‌కు దాదాపు 15 ల‌క్ష‌ల వ‌ర‌కు కీర్తి సురేశ్ రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు మహేష్ బాబు సర్కారు వారి పాట, నాని దసరా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలతో చాలా బిజీగా ఉంది