Keerthy suresh: వావ్ కీర్తి.. ఎరుపెక్కిన అందంతో మంత్రముగ్ధులని చేస్తున్నావుగా..!
NQ Staff - January 9, 2022 / 05:22 PM IST

Keerthy suresh: కీర్తి సురేష్.. ఈ అమ్మడి పేరు చెబితే మనకు మహానటి సావిత్రి గుర్తుకు వస్తారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి చిత్రంతో అందరి ప్రశంసలు పొందింది. ‘మహానటి’ కీర్తి సురేశ్‌ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్‌గా మార్చింది. అందుకే మొదట్లో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి చిత్రాలు చేసింది.

keerthy suhesh amazing look3
ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పెద్దగా కలసి రాకపోవడంతో ఇక హీరోయిన్ రోల్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటోంది. ఇప్పటికే సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. అలాగే దసరా మూవీలో నాని కి జోడిగా నటించేందుకు డేట్స్ కేటాయించింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించబోతున్న ప్యాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్ గా నటించాలనుకుంటోందట.

keerthy suhesh amazing look3
కీర్తి సురేష్..సిస్టర్ రోల్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తోంది కీర్తి. అన్నాత్తే, సాని కాయిదమ్, భోళా శంకర్ ఈ మూడు చిత్రాల్లోనూ సిస్టర్స్ రోల్స్ చేస్తోంది. అన్నాత్తేలో రజనీకాంత్ కు, భోళాశంకర్ లో చిరుకు, అలాగే సానికాయిదమ్ అనే తమిళ సినిమాలో సెల్వరాఘవన్ కు చెల్లెలి పాత్రలో కనిపించనుంది కీర్తి.

keerthy suhesh amazing look3
స్టార్ డమ్ అందుకున్న తర్వాత రిపీటెడ్ గా కీర్తి సిస్టర్ రోల్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. హీరోయిన్ మాత్రమే కాకుండా ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా చేస్తుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ మరో పక్క సిస్టర్ క్యారెక్టర్స్ కూడా చేస్తుండటం విశేషం. ఉదయనిధి స్టాలిన్‌తోను ఈ అమ్మడు ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

keerthy suhesh amazing look3
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే కీర్తి సురేష్ అప్పుడప్పుడు గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది. ఈ అమ్మడు తాజాగా రెడ్ డ్రెస్‌లో షేర్ చేసిన పిక్స్ అందదరి మతులు పోగొడుతున్నాయి. కీర్తి లుక్ కేక పెట్టిస్తున్నాయి.