Keerthi suresh : కీర్తి సురేష్‌కి పాన్ ఇండియన్ సినిమాలో ఛాన్స్..?

Keerthi suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలుగుతోంది. హిందీలో నటించే అవకాశం వచ్చినా కూడా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా సౌత్ సినిమాలతో ఉంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాటలో హీరోయిన్‌గా నటిస్తోంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో కీర్తి క్యారెక్టర్ చాలా హైలెట్ అవుతుందని ఫన్నీగా సాగుతుందని తెలుస్తోంది. దుబాయ్ లో జరిగిన నెల రోజుల షెడ్యూల్‌తో 25 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలో హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలవనుంది.

keerthi-suresh-got pan indian movie chance
keerthi-suresh-got pan indian movie chance

కోలీవుడ్‌లో రజనీకాంత్‌కి చెల్లిగా నటిస్తోంది. అన్నాత్తే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసింది కీర్తి. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. కాగా గత ఏడాది వరుసగా తను నటించిన సినిమాలు ఫ్లాపవడంతో ఒక్కో సినిమాను ఆచితూచి కమిటవుతోంది. ఈ క్రమంలో ఓ పాన్ ఇండియన్ సినిమాలో నటించే అవకాశం అందుకుందని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే, రష్మిక మందన్నల కంటే కీర్తికే ముందు ఈ అవకాశం దక్కాల్సింది.

Keerthi suresh : కీర్తి సురేష్ న‌టించే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే..?

కానీ కాస్త రేస్‌లో వెనకబడింది. కాగా కోలీవుడ్ స్టార్ విజయ్‌తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్‌రాజు ఓ పాన్ ఇండియా సినిమా నిర్మించబోతున్నారు. ఇప్పటికే వంశీ పైడిప‌ల్లి ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌తో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కంప్లీట్ చేస్తున్నాడట. ఇందులో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ పేరు ప‌రిశీలిస్తున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లో ఓకే అయితే, కీర్తి న‌టించే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మేకర్స్ నుంచి కన్‌ఫర్మేషన్ రావాల్సిందే.