RRR: మూడేళ్ల చిన్నారితో ఆర్ఆర్ఆర్‌లో కొమ్మా ఉయ్యాల పాట పాడించిన కీర‌వాణి

NQ Staff - April 5, 2022 / 03:05 PM IST

RRR: మూడేళ్ల చిన్నారితో ఆర్ఆర్ఆర్‌లో కొమ్మా ఉయ్యాల పాట పాడించిన కీర‌వాణి

RRR: ప్ర‌స్తుతం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తూ రికార్డుల‌ని చెరిపేస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్స్ వైపు దూసుకెళుతుంది. ఈ క్ర‌మంలో సినిమాకి సంబంధించి అనేక ఆస‌క్తిక‌ర సంగ‌తులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ విష‌యాన్ని కీర‌వాణి షేర్ చేసుకున్నారు.

Keeravani Made 3 years Old girl to Sing Komma Uyyala Song in RRR

Keeravani Made 3 years Old girl to Sing Komma Uyyala Song in RRR


సినిమా ప్రారంభంలోనే ఆ చిన్నారి బ్రిటీష్ దొరసాని చేతి మీద డిజైన్ వేస్తూ “కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా..” అంటూ పాడే సాంగ్ ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది. అయితే అసలు ఈ సాంగ్ రియల్‌గా పాడింది మాత్రం ఓ మూడేళ్ల చిన్నారి అని కీర‌వాణి అన్నారు. ప్రకృతి అనే చిన్నారి ఈ సాంగ్ పాడిందని, ఈ సాంగ్‌ని 2019 మార్చి 15న పాడినప్పుడు ఆ చిన్నారి వయస్సు కేవలం మూడేళ్లు మాత్రమేనని తాజాగా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చెప్పుకొచ్చాడు.

అంతేకాదు ఆ చిన్నారి చాలా టాలెంటెడ్ అని అన్నాడు. ఇకపోతే ఆర్ఆర్ఆర్ బీజీఎంను ప్రశంసించిన వారందరికి ధన్యవాదాలు అని, ఈసారి నేను ఆలస్యం చేయను.. ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ఒక నెలలోపు విడుదల అవుతుందని, అందులో మల్లి పూర్తి పాట ఉంటుందని కీరవాణి చెప్పుకొచ్చాడు.

సినీ ప్రియులను ఆకట్టుకున్న ఆ పాట పాడిన బాలగాయని ప్రకృతి రెడ్డి. జూలై 21న 2010 కర్ణాటకలోని బళ్లారిలో జన్మించింది. ప్రకృతికి చిన్నతనం నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. దీంతో ఆమె తల్లిదండ్రులు సంప్రదాయ సంగీతంలో శిక్షణ ఇప్పించారు. ఓవైపు చదువుకుంటూనే పలు సంగీత పోటీల్లోనూ పాల్గొంటూ ఎంతోమందిని మెప్పించింది.

కన్నడలోనే కాకుండా.. తెలుగు, తమిళం, హిందీలోనూ పాటలు పాడడం నేర్చుకుంది. బుల్లితెరపై వచ్చే పలు రియాల్టీ షోల్లోనూ పాల్గొంది. తెలుగులో ఎస్పీ బాలు, వాణీ జయరామ్, సునీత, ఎస్పీ శైలజ, చంద్రబోస్, కోటి వంటి సంగీత దర్శకులు.. సింగర్స్ ‏ను తన పాటలతో మెప్పించింది ప్రకృతి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us