KCR: రోజాకు ఫోన్ చేసిన కేసీఆర్.. ఆరోగ్య‌ప‌రిస్థితుల గురించి ఆరా తీసిన తెలంగాణ సీఎం

KCR న‌టి, వైసీపీ ఎమ్మేల్యే రోజా ఇప్ప‌టికీ జ‌బ‌ర్ధ‌స్త్ అనే షోతో పాటు ప‌లు షోల‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. నెల రోజుల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఆమెకు స‌ర్జరీ చేశారు. ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంతం కావ‌డంతో వైద్యులు స‌ల‌హా మేర‌కు చెన్నైలోని త‌న నివాసంలో విశ్రాంతి తీసుకుంటుంది రోజా. అయితే ఈమెకు స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని తెలిసి పలువురు ప్ర‌ముఖులు ఆమెకు కాల్ చేసి క్షేమ స‌మాచారాలు అడిగి తెలుసుకుంటున్నారు. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు రోజాకు కాల్ చేసి ప‌రామ‌ర్శించిన‌ట్టు తెలుస్తుంది.

ఎమ్మేల్యే రోజా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. అలానే కుటుంబ స‌భ్యుల యోగ‌క్షేమాల‌ను కూడా కేసీఆర్ అడిగి తెలుసుకున్నార‌ట‌.కేసీఆర్ నుండి ఫోన్ రావ‌డంపై రోజా సంతోషం వ్య‌క్తం చేసింది. కాగా, కేసీఆర్ కొద్ది రోజుల క్రితం క‌రోనా బారిన ప‌డిన కేసీఆర్ ప్ర‌స్తుతం త‌న ఫాం హౌజ్‌లో చికిత్స పొందుతున్నారు. రీసెంట్‌గా య‌శోద ఆసుపత్రికి వ‌చ్చి వైద్య‌ప‌రీక్ష‌లు కూడా చేయించుకున్నారు. ప్రస్తుతం కెసిఆర్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిన‌ట్టు తెలుస్తుంది. చిరంజీవి వంటి సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు.ఇదిలా ఉంటే కేసీఆర్ త‌న‌యుడు మంత్రి కేటీఆర్, బంధువు ఎంపి సంతోష్ కుమార్ కు కరోనా సోకడంతో అభిమానుల‌లో ఆందోళ‌న నెల‌కొంది.

Advertisement