Kaushal: కౌశ‌ల్‌ని పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్ .. ఎందుకో తెలుసా?

Samsthi 2210 - July 23, 2021 / 12:31 PM IST

Kaushal: కౌశ‌ల్‌ని పిచ్చిపిచ్చిగా ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్ .. ఎందుకో తెలుసా?

Kaushal: బిగ్ బాస్ షోతో ఫుల్ ఫేమ‌స్ అయిన కంటెస్టెంట్ కౌశ‌ల్. బిగ్ బాస్ ముందు వ‌ర‌కు ఆయ‌నెవ‌రో తెలియ‌దు. కాని బిగ్ బాస్ హౌజ్‌కి ఆయ‌న వ‌చ్చిన స‌మ‌యంలో ఆర్మీలు ఏర్ప‌డ్డాయి. కౌశ‌ల్ కోసం పెద్ద ఎత్తున ప్ర‌చారాలు చేశారు. అనేక సార్లు ఎలిమినేష‌న్ జోన్‌కి వెళ్లినా కూడా ప్ర‌జ‌లు కౌశ‌ల్‌కు భారీ ఓటింగ్ వేసి గెలిపించారు. అయితే కౌశ‌ల్ ఎంత పాజిటివిటీ తెచ్చుకున్నాడో, ఆయ‌న‌కు అంతే నెగెటివిటీ కూడా ఏర్ప‌డింది.

kau2

కెరీర్ కోసం మొద‌టి నుండి చాలా క‌ష్ట‌ప‌డుతున్న కౌశ‌ల్ ఏదో ఒక రోజు హీరోగా ఎద‌గాల‌ని అనుకున్నాడు. బిగ్ బాస్ త‌ర్వాత కౌశ‌ల్‌కి అనేక ఆఫ‌ర్స్ వ‌చ్చాయి కాని, ప‌లు కార‌ణాల వ‌ల‌న సెట్స్ పైకి వెళ్ల‌లేద‌నే టాక్ ఉంది. ప్ర‌స్తుతానికి అయితే కొన్ని చిత్రాల‌లో కౌశ‌ల్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ చేస్తున్నాడు. ఆది సాయి కుమార్ బ్లాక్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కౌశల్ నటిస్తున్నారు. అయితే తాజాగా తాను హీరోగా రాబోతోన్న ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైందంటూ కౌశల్ ప్రకటించారు.

త‌న సోష‌ల్ మీడియాలో త‌న‌కు తాను పీపుల్ స్టార్ అని చెప్పుకున్న కౌశ‌ల్‌.. ‘గత మూడు సంవత్సరాలుగా నన్ను అభిమానిస్తూ నన్ను “పీపుల్ స్టార్” గా పిలుచుకుంటూ ఆనందిస్తూ, అన్నా నిన్ను బిగ్ స్క్రీన్ మీద హీరో గా చూడాలను వుంది ఆ అవకాశం మాకు ఎప్పుడు వస్తుంది అంటూ ప్రతీ రోజు అడుగుతూ వారి కోరిక తీర్చటమే నా కలగా మార్చిన నా అభిమానులందరి కోసం ఈ రోజు మీ అందరి రోజు గా చేస్తూ నేను హీరో గా నటిస్తున్న “రైట్” మూవీ ముహూర్తం షాట్ మీతో పంచుకోవాలని అనుకుంటున్నా.

kau1

ఎప్పటి లాగే మీ ప్రేమ , అభిమానం నా మీద , మా మూవీ యూనిట్ మొత్తం మీద చూపిస్తారని నాకు తెలుసు’ అని అన్నారు.ఇన్నాళ్లకు నటుడు కౌశల్‌ హీరో అవుతుండటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అయితే కొందరు మాత్రం పీపుల్‌ స్టారా, నీకు ఇదెవ‌రు పెట్టారు అంటూ కౌంటర్స్ వేస్తున్నారు. ఆ మ‌ధ్య అల్లు అర్జున్‌ ఐకాన్ స్టార్ బిరుదు త‌న‌కు తానుగా పెట్టుకోవ‌డంతో ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us