Katrina Kaif: పెళ్లి పీట‌లెక్క‌బోతున్న క‌త్రినా.. వ‌రుడు ఎవ‌రో తెలుసా?

Katrina Kaif: మొన్న‌టి వ‌ర‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్స్‌గా సినీ సెల‌బ్రిటీస్ అంద‌రు ఒక్కొక్క‌ళ్లుగా పెళ్లి పీట‌లెక్కారు. త్వ‌ర‌లో మ‌రి కొంత మంది అందాల భామ‌లు కూడా పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో క‌త్రినా కైఫ్ పెళ్లి వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కార‌ణం ఆమె సోష‌ల్ మీడియాలో ఇచ్చిన రిప్లైనే.

Katrina Kaif

క‌త్రినా రీసెంట్‌గా త‌న 38వ బ‌ర్త్ డే సెల‌బ్రేట్ చేసుకోగా, ఆమెకు ప‌లువురి నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిసింది. అభిమానులు, సెల‌బ్రిటీలు క‌త్రినాకు విషెస్ అంద‌జేశారు. సల్మాన్‌ ఖాన్‌ మేనేజర్‌, స్టయిలిస్ట్‌ యాష్లె కత్రినా పుట్టినరోజు సందర్భంగా ఆమె పెళ్లి డ్రెస్‌లో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. త్వరలోనే ఇది నిజం కావాలంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీనికి స్పందించిన‌ కత్రినా ‘థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ పోస్ట్‌ చర్చనీయాంశమైంది.

క‌త్రినా గతంలో ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ తో ప్రేమాయ‌ణం న‌డ‌ప‌గా, ప్ర‌స్తుతం యంగ్ హీరో విక్కీ కౌశ‌ల్‌తో ప్రేమలో ఉంద‌నే టాక్ వినిపిస్తుంది. గ‌త కొంత కాలంగా ఈ ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ న‌డుస్తుంద‌నే పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకు బ‌ల‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయి లేండి. వీళ్లిద్దరూ తరచూ కలుసుకుంటూ చెట్టాపట్టాలేసుకుని చాలాసార్లు కెమెరాలకు చిక్కారు. కానీ తమ లవ్‌ కహానీపై మాత్రం ఇంతవరకు ఎలాంటి కన్‌ఫార్మేషన్‌ ఇవ్వలేదు.

Katrina Kaif

40 ఏళ్ల‌లోపు క‌త్రినా పెళ్లి చేసుకోవాల‌ని అనుకుంటుంద‌ని, ఈ క్ర‌మంలోనే మ‌రికొద్ది రోజుల‌లో క‌త్రినా పెళ్లి పీట‌లెక్క‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు జోస్యాలు చెబుతున్నారు. క‌త్రినా చేసుకోబోయే వ్య‌క్తి త‌ప్ప‌నిస‌రిగా విక్కీ కౌశ‌ల్ అని కూడా బీ టూన్ మీడియా ఫిక్స్ అయిపోయింది. దీనిపై అఫీషియ‌ల్ క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. గ‌తంలో స‌ల్మాన్‌తో ప్రేమాయాణం న‌డిపిన క‌త్రినా అనంత‌రం ర‌ణ్‌బీర్‌తో పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. కాని ఎందుకో ఇద్ద‌రి మ‌ధ్య చెడ‌డంతో ర‌ణ్‌బీర్..అలియాను పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు.