Katrina: క‌త్రినా ప్రేమ వ్య‌వ‌హారాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన న‌టుడి కుమారుడు

Katrina: సెల‌బ్రిటీల మ‌ధ్య ప్రేమ ఎప్పుడు పుడుతుందో, ఎప్పుడు పోతుందో చెప్ప‌డం చాలా క‌ష్టం. ప్రేమ అంటారు అంత‌లోనే బ్రేక‌ప్ అంటారు. అయిన‌ప్పటికీ కొన్ని ప్రేమాయ‌ణాలు ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. సైలెంట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న సెల‌బ్స్ కొంత కాలం త‌ర్వాత పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ వ్య‌వ‌హారం చూసి ఫ్యాన్స్ అవాక్క‌వుతున్నారు.

Katrina

బాలీవుడ్ లో విక్కీ కౌశ‌ల్‌, క‌త్రినా కైఫ్‌ల మ‌ధ్య ప్రేమ న‌డుస్తుంద‌ని కొన్నాళ్ల నుండి అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి. వీరి ప్రేమాయ‌ణం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మార‌గా, ఇందులో ఎంత నిజం ఉంద‌నే దానిపై ఇప్ప‌టివ‌ర‌కు క్లారిటీ లేదు. నెట్టింట తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్న‌ప్ప‌టికీ ఇద్ద‌రిలో ఎవ‌రు నోరు విప్ప‌లేదు. అలా అని ఇద్దరి ప్రేమ‌లేద‌ని ఖండించ‌లేదు. ఈ క్ర‌మంలో నెటిజన్స్ వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ న‌డుస్తుంద‌ని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సమయంలో బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ తనయుడు హర్ష వర్థన్ కపూర్ వీరి ప్రేమ‌పై ఓ క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా ఓ టాక్ షోలో విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ ల మద్య ఉన్న వ్యవహారంపై స్పందిస్తూ .. నిప్పు లేనిదే పొగ రాదు అన్న‌ట్టు విక్కీ కౌశ‌ల్, క‌త్రినా కైఫ్ మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తుంది. వారిద్ద‌రు రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే. ఇప్పుడు ఈ విష‌యం చెప్పినందుకు అది వివాదం కావొచ్చు. అయినా కూడా ఉన్నవాస్తవం అన్నట్లుగా అతడు చెప్పుకొచ్చాడు. హర్ష వర్థన్ కపూర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా నెట్టింట విక్కీ కౌశల్ మరియు కత్రీనాల హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి.

Katrina

విక్కీ కౌశ‌ల్‌- క‌త్రినా కైఫ్ ప్రేమాయ‌ణం క‌న్‌ఫాం చేశాక నెటిజ‌న్స్ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు. మంచి న‌టుడు అయిన విక్కీ.. క‌త్రినాతో ప్రేమ‌లో ప‌డ‌డం ఏంటి, అంత సీనియ‌ర్ హీరోయిన్ త‌ప్ప మరో హీరోయిన్ దొర‌క‌లేదా అంటూ ప‌లువురు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వీరిద్దరి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ వర్గాల్లో మరియు నెట్టింట తెగ ట్రెండ్డింగ్ అవుతూ ఉంది. మ‌రి హ‌ర్షవ‌ర్ధ‌న్ వ్యాఖ్య‌ల త‌ర్వాత అయిన కత్రినా లేదంటే విక్కీ కౌశ‌ల్ ల‌లో ఎవ‌రైన స్పందిస్తారా అనేది చూడాలి.

ఉరి సినిమాతో విక్కీ కౌశ‌ల్ బాలీవుడ్ నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కే పెద్ద పీట వేస్తున్న విక్కీ కౌశ‌ల్ ఇప్పుడు ప‌లు ఆస‌క్తిర క‌థా చిత్రాలు చేస్తున్నారు. ఇక క‌త్రినా కైఫ్‌కు ఈ మ‌ధ్య ఆఫ‌ర్స్ క‌రువ‌య్యాయి. అడ‌పాద‌డ‌పా చిన్నా చిత‌క పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించే ప్ర‌య‌త్నం చేస్తుంది.