Katrina Kaif and Vicky Kaushal : క‌త్రినా- విక్కీ కౌశ‌ల్ త‌మ పెళ్లికి వ‌చ్చే వారికి ఎలాంటి కండీష‌న్స్ పెట్టారో తెలుసా?

Katrina Kaif and Vicky Kaushal : బాలీవుడ్ ప్రేమ పక్షులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్​ త్వరలో పెళ్లి చేసుకోనున్నారనే వార్త ఇప్పుడు బీ టౌన్‌లో దావానంలా వ్యాపించింది.గ‌త కొద్ది రోజులుగా పెళ్లికి సంబంధించి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్నా కూడా వీరి వివాహంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయినప్పటికీ బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఇటీవల వీరికి ఎంగేజ్​మెంట్ అయ్యింది.

TheNewsQube-
Katrina Kaif and Vicky Kaushal marriage conditions
Katrina Kaif and Vicky Kaushal marriage conditions

డిసెంబర్‌ మొదటి వారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుంది. డిసెంబర్‌ 7 నుంచి 9 వరకు జరగనున్న ఈ వివాహ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ముఖ్య స్నేహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం.

పెళ్లి పనులు దగ్గర పడుతున్న నేపథ్యంలో షాపింగ్​లో ఇరు ఫ్యామిలీలు బిజీ బిజీగా ఉన్నాయంట తమ జీవితాల్లో ఎంతో కీలకమైన ఈ రోజుని కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని వీరిద్దరూ భావించారట. అందుకే ఫ్రెండ్స్‌కి మాత్రమే వెడ్డింగ్‌ కార్డులు అందించారట. అంతేకాకుండా, పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్‌ కావడం తమకు ఇష్టం లేదని.. అందుచేత పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని వారు కోరినట్లు తెలుస్తోంది.

ఫంక్షన్‌ని ఏర్పాటు చేస్తోన్న ఆర్గనైజర్స్‌కి సైతం ఈ విషయంపై రూల్‌ పాస్‌ చేశారట. మరోవైపు, శుభకార్యం దగ్గరపడుతోన్న తరుణంలో ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ జంట గత కొన్నిరోజుల నుంచి పెళ్లి పనుల్లో ఫుల్‌ బిజీగా పాల్గొంటున్నారట. పెళ్లి దుస్తులు, ఆభరణాల సెలక్షన్‌, అతిథుల కోసం ఇచ్చే విందు… ఇలా అన్ని విషయాలు దగ్గరుండి గమనిస్తున్నారని బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది.

త‌మ రిలేషన్‌షిప్‌ విషయంలో మొదటి నుంచి గోప్యత వహించిన ఈ లవ్ బర్డ్స్ ఎట్ట‌కేల‌కు పెళ్లి చేసుకోవాల‌నుకోవ‌డం గొప్ప విశేష‌మే. పెళ్లి దుస్తులు, ఆభరణాల సెలక్షన్‌, అతిథుల కోసం ఇచ్చే విందు ఇటు కత్రినా అటు విక్కీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారని సమాచారం.