Kartikeya: పవన్ కళ్యాణ్ వ్యాఖ్య‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలంటూ కార్తికేయ ట్వీట్

Kartikeya: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం హాజరైన పవన్ కళ్యాణ్, ఏపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ విపరీతంగా దుమారం రేగాయి.

ఈ కామెంట్స్ కి ధీటుగా ఏపీ ప్రభుత్వం మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక్కొక్కరుగా పవన్ కళ్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ కామెంట్స్ తో ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ పోటాపోటీగా ఉన్నాయి.

వైసీపీ నేతలు, మంత్రులు పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగు సినీ హీరోలు పవన్ కళ్యాణ్ కు మద్ధతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. రీసెంట్ గా న్యాచురల్ స్టార్ నాని ఏపీ రాజకీయాలకు, పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న విభేదాలు పక్కన బెడితే సినిమా పరంగా పవన్ కళ్యాణ్ మాట్లాడింది వాస్తవం అంటూ ఏపీ సీఎం జగన్ ను ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ చేశారు.

ఇక ఇప్పుడు తెలుగు హీరో కార్తికేయ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ లో కార్తికేయ.. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, మద్దతుగా నిలవట్లేదని, కానీ పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడిన మాటలు, సమస్యలు ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సినవి అన్నారు. సినీ ఇండస్ట్రీలో సభ్యుడిగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వడం తన బాధ్యత అని హీరో కార్తికేయ తెలిపారు.