Kartikeya : కార్తికేయ ఈ సినిమాతో స్టార్ అవుతాడు అంటున్నారు..!

Kartikeya : ఆర్ ఎక్స్ 100 సినిమాతో బాగా పేరు తెచ్చుకున్నాడు కార్తికేయ. అంతక ముందు ఒక సినిమా చేసినా అంతగా గుర్తింపు రాలేదు గాని ఆర్ ఎక్స్ 100 మాత్రం కెరీర్ లో చెప్పుకునే సినిమాగా నిలిచింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కానీ ఆర్ ఎక్స్ 100 లాంటి హిట్ మాత్రం పడటం లేదు. డాన్స్.. పర్ఫార్మెన్స్ ..ఫైట్స్.. ఇలా అన్నిటిలో కార్తికేయ బాగా చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్ద నిర్మాణ సంస్థలో సినిమా చేసే అవకాశం అందుకుంటున్నాడు.

kartikeya-is-goin-to-become-a-star-by-this-movie
kartikeya-is-goin-to-become-a-star-by-this-movie

ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్2 లో ఆల్లు అరవింద్ సమర్పణలో చావు కబురు చల్లగా అన్న సినిమా చేశాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ప్రమోషన్స్ కూడా బాగా నిర్వహించి ప్రేక్షకుల్లో విపరీతంగా బజ్ క్రియేట్ చేశారు. కాగా కార్తికేయ ఈ సినిమాతో స్టార్ అవుతాడన్న మాట ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తోంది. పెద్ద సంస్థ చేయడం పెద్ద ప్లస్ పాయింట్ అంటున్నారు.

Kartikeya : ఈ సినిమాలో అనసూయ స్పెషల్ నంబర్ కూడా ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో అనసూయ స్పెషల్ నంబర్ కూడా ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాలో కార్తికేయ పాత్ర పేరే ‘బస్తీ బాలరాజు’గా కనిపించబోతున్నాడు. శవాలను శ్మశానానికి తరలించే వ్యాన్ కి డ్రైవర్ గా కొత్త క్యారెక్టర్ చేసిన కార్తికేయకి చావు కబురు చల్లగా ఎలాంటి సక్సస్ ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా మంచి విష్ణు – కాజల్ నటించిన మోసగాళ్ళు సినిమాతో పాటు మరో రెండు సినిమాలు పోటీగా రిలీజవుతున్నాయి.

Advertisement