Kiara Advani : హీరోయిన్ కు చెప్పులు తొడిగిన స్టార్ హీరో.. ఇదేం తీరు బాబు..!
NQ Staff - June 23, 2023 / 11:18 AM IST

Kiara Advani : సెలబ్రిటీలు అన్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియాలో ఏకిపారేస్తుంటారు జనాలు. ఆ విషయాలను దృష్టిలో ఉంచుకుని జనాల్లో మెదలాలి. కానీ అప్పుడప్పుడు వారు చేసే అతి ట్రోల్స్ కు దారి తీస్తూ ఉంటుంది. తాజాగా ఓ స్టార్ హీరో చేసిన పని కూడా ఇలాగే ఉంది.
ఆయన ఏకంగా హీరోయిన్ కాళ్లకు చెప్పులు తొడగడంలో సాయం చేశాడు. అందుకే ఆయన్ను ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్. హీరోయిన్ కియారా అద్వానీతో కలిసి ఆయన తాజాగా నటించిన మూవీ ‘సత్య ప్రేమ్ కి కథా’. ఈ మూవీ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ముంబైలో సాంగ్స్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ ఈవెంట్ లో కియారా స్టేజిమీదకు డ్యాన్స్ చేసేందుకు వెళ్లింది. ఆమె హై హీల్స్ వేసుకోవడం వల్ల వాటిని పక్కన పడేసి డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ అయిపోయాక చెప్పుల కోసం వెతుకుతుండగా.. కార్తీక్ తీసుకువచ్చి ఆమెకు తొడిగాడు.
దాంతో ఇందుకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన వారంతా ఆమెను తిట్టిపోస్తున్నారు. ఎంత హీరోయిన్ వు అయితే మాత్రం హీరోతో చెప్పులు తొడిగించుకోవాలా.. హీరో కార్తీక్ కు కూడా బుద్దిలేదు. ఆమె తొడుక్కోలేదా.. అంత ఓవర్ అవసరమా అంటూ కామెంట్లతో నింపేస్తున్నారు.