Karthikeya: నేను హీరో అవుతా, నా పెళ్లికి చిరు వ‌స్తారు.. కన్న క‌ల‌లు నిజ‌మ‌య్యాయి అంటూ కార్తికేయ కామెంట్స్

Karthikeya: యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ ఇటీవ‌ల తన ప్రేయసి లోహిత మెడలో మూడుముళ్లు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగ‌తి తెలిసిందే . ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది.

karthikeya-shared-his-childhood-memories3
karthikeya-shared-his-childhood-memories3

ఈ వేడుకలో చిరంజీవి, అల్లు అరవింద్‌, తనికెళ్ల భరణి, సాయికుమార్‌, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌పూత్‌లతో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని.. వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం అజిత్‌తో కలిసి కార్తికేయ నటించిన ‘వాలిమై’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

కార్తీకేయ మెగాస్టార్‌కు పెద్ద అభిమాని అనే సంగతి తెలిసిందే. ఓ మూవీ ఈవెంట్‌లో చిరు పాటకు డ్యాన్స్‌ చేసిన కార్తీకేయ అనంతరం మాట్లాడుతూ.. చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన తనకే కాదు ఈ తరం హీరోలందరి స్ఫూర్తి అంటూ చెప్పకొచ్చాడు. అలాగే చిరంజీవి గారిని కలవడం తన చిరకాల కలగా ఉండేదని చెప్పాడు.

ఈ నేపథ్యంంలో తన పెళ్లికి చిరంజీవి రావడంతో కార్తీకేయ సంబరంలో మునిగితేలుతున్నాడు. ఈ పెళ్లిలో నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న చిరు ఫొటోను షేర్‌ చేస్తూ తెగ మురిసిపోయాడు కార్తీకేయ.ఈ సందర్భంగా కార్తీకేయ ఓ ఆసక్తిక సంఘటనను పంచుకున్నాడు.

karthikeya-shared-his-childhood-memories1
karthikeya-shared-his-childhood-memories1

‘చిన్నప్పుడు నేను తరచూ ఒక మాట అంటూ ఉండేవాడినట. నేను పెద్దయ్యాక హీరోను అవుతాను. నా పెళ్లికి చిరంజీవి కూడా వస్తారు అని అనేవాడినట. నేను అల అనడంతో మా నాన్నా నా అమాకపు మాటలకు మురిసిపోతూ సరే నాన్నా అంటూ నా భుజాలు తడుతుండేవారట. కానీ విధి ఎంత చిత్రమైనది.. నిజంగానే నేను హీరోనయ్యాను.. నా పెళ్లికి మెగాస్టార్ వచ్చారు. నా జీవితంలో నేను ఎప్పటికీ మరిచిపోలేని రోజు’ అంటూ చెప్పుకొచ్చాడు.