Karthikeya Marriage : అంగరంగ వైభవంగా హీరో కార్తికేయ పెళ్ళి..ఫొటోలు హల్ చల్

Karthikeya Marriage : ఆర్ ఎక్స్ 100 సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన కార్తీకేయ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అజిత్ నటిస్తున్న వాలిమై సినిమాలో విలన్ గా కోలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఇక గత కొన్ని రోజుల క్రితం తన ప్రియురాలు లోహితతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్తీకేయ పెళ్ళికొడుకుగా పెళ్ళి పీటలు ఎక్కుతున్నారు.

TheNewsQube-
Karthikeya Marriage photos
Karthikeya Marriage photos

వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్ళి కొడుకుగా కార్తీకేయ ఎంతో చక్కగా ఉన్నారు. లోహితను, కార్తీకేయ బీటెక్ లో ఉన్నప్పటి నుండి ఇష్టపడ్డట్లుగా రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో తెలిపారు. వీరిద్దరి మధ్య జరిగిన ఎన్నో అందమైన గుర్తులను ప్రేక్షకులతో పంచుకున్నారు.

Karthikeya Marriage photos
Karthikeya Marriage photos

ఆయన నటించిన రీసెంట్ సినిమా రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో లోహితను స్టేజ్ మీదకు పిలిచి మరీ కార్తీకేయ ప్రపోజ్ చేసి ఆమెను సర్ ప్రైజ్ చేశారు. వీరిద్దరూ మొదటిసారి 2010 లో కలుసుకున్నారు. వీరిద్దరి బంధం పదేళ్ళుగా ఎంతో అందంగా కొనసాగింది.

Karthikeya Marriage photos
Karthikeya Marriage photos

ఇక ఆరోజున కార్తికేయ, లోహితల వివాహం జరిగింది. కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్న వీరిద్ధరికీ పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ పాత్రను పోషించారు.

అలాగే కోలీవుడ్ లో వాలిమై సినిమాతో మరోసారి విలన్ గా నటిస్తున్నారు. తాన్యా రవిచంద్ర, కార్తీకేయ హీరో హీరోయిన్ లుగా నటించిన రాజా విక్రమార్క సినిమా మంచి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక పెళ్ళి తర్వాత కూడా కార్తికేయ సినీ కెరీర్ అద్భుతంగా ఉండాలని కోరుకుందాం.