Karthika Deepam: అదీ వంటలక్క రేంజ్.. దేశవ్యాప్తంగా ‘కార్తీకదీపం’ రచ్చ

NQ Staff - January 22, 2021 / 04:34 PM IST

Karthika Deepam: అదీ వంటలక్క రేంజ్.. దేశవ్యాప్తంగా ‘కార్తీకదీపం’ రచ్చ

Karthika Deepam తెలుగు నాట కార్తీకదీపం సీరియల్‌ది ఓ ప్రత్యేకమైన చరిత్ర. బుల్లితెర పై ఓ సీరియల్ ఇంతగా ఆదరణకు నోచుకోవడం, సీరియల్ కథ కథనాలు అందరికీ నచ్చిన ఇలా పాత్రధారులను ప్రేక్షకులు తమ జీవితాల్లో భాగస్వాములు చేసుకోవడం అరుదుగా జరుగుతుంది. కార్తీక్, దీప, డాక్టర్ బాబు, శౌర్య, హిమ, సౌందర్య, మోనిత ఇలా అన్ని పాత్రలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రతీ ఒక్కరికి తమ తమదైన క్రేజ్ ఫాలోయింగ్ ఉంది.

వంటలక్క క్రేజ్ : Karthika Deepam
అయితే కార్తీకదీపం సీరియల్ క్రేజ్ అంతా ఒకెత్తు.. కార్తీక్, డాక్టర్ బాబుగా నిరుపమ్ క్రేజ్ అంతా మరోఎత్తు. అయితే అందరి కంటే ఎక్కువగా దీప, వంటలక్క పాత్రలకే ఫాలోయింగ్ ఎక్కువ. పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా రేటింగ్ విషయంలో వంటలక్క ముందు ఓడిపోతుంటారు. ఇక వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ క్రేజ్ తెలియాలంటే సోషల్ మీడియాలో మీమ్స్ ట్రోల్స్‌ను ఫాలో అవ్వాల్సిందే.

Karthika deepam Premi viswanath Got Best Actress Award In ormax

Karthika deepam Premi viswanath Got Best Actress Award In ormax

వెండితెరపై..
అలా దీప, వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్ ఎక్కడాలేని క్రేజ్‌ను సంపాదించుకుంది. తెలుగు బుల్లితెరపై ప్రేమీ విశ్వనాథ్ చెరగని ముద్రవేసింది. అయితే త్వరలోనే కార్తీకదీపం సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడబోతోన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ప్రేమీ విశ్వనాథ్ కూడా వెండితెరపై నటించేందుకు సిద్దమైంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ కనిపించబోతోన్నట్టు తెలుస్తోంది.

ఉత్తమనటి
అయితే తాజాగా ప్రేమీ విశ్వనాథ్ ఖాతాలో అరుదైన రికార్డ్ పడింది. దేశ వ్యాప్తంగా టెలివిజన్ (తెలుగు) బెస్ట్ యాక్టర్‌గా అరుదైన రికార్డ్ ప్రేమీ విశ్వనాథ్ సొంతమైంది. ప్రతీ ఏడాది.. ఆర్మాక్స్ మీడియా దేశ వ్యాప్తంగా ఉన్న బుల్లితెర నటీనటులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారి లిస్ట్ ప్రకటిస్తూ వస్తోంది. అలా 2020 ఏడాదికి గానూ కార్తీకదీపం సీరియల్‌ నుంచి ఉత్తమ కల్పిత పాత్రల విభాగంలో వంటలక్క ఈ ఘనత సాధించింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us