Karthika Deepam: వెండితెరకు కార్తీకదీపం సౌందర్య… అనసూయకు ధీటుగా!
NQ Staff - March 8, 2021 / 01:06 PM IST

Karthika Deepam కార్తీకదీపం ఫేమ్ సౌందర్య గురించి అందరికీ తెలిసిందే. అత్తగా గంభీరంగా ఉంటూనే కోడలి పక్షాన నిలబడే పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. కార్తీకదీపం సీరియల్‌లో సౌందర్యగా కనిపించే ఆమె పేరు అర్చన. ఇప్పుడు బుల్లితెరపై ఈమెకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అందుకే కేరాఫ్ అనసూయ అని ఏకంగా ఆమెను మెయిన్ లీడ్‌గా పెట్టి ఓ సీరియల్‌ను చేసేశారు.
అత్తారింటికి దారేది సినిమాలో నదియా టైపులో సాగే అర్చనకు ఇప్పుడు బుల్లితెరపై మంచి డిమాండ్ ఉంది. అయితే బుల్లితెరపైనే కాకుండా అర్చన వెండితెరపైనా రచ్చ చేసేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది. అది కూడా అనసూయకు ధీటుగా నడిచే పాత్రలో కనిపించబోతోన్నట్టుంది.
వెండితెరకు కార్తీకదీపం సౌందర్య… అనసూయకు ధీటుగా!: Karthika Deepam
నేటి ఉమెన్స్ డే స్పెషల్‌గా అనసూయ థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోస్టర్‌ను రిలీజ్ చేయగా ఇందులో అనసూయ, అర్చన, శ్రద్దా శ్రీనాథ్‌లతో కూడిన ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. చూస్తుంటే ఇందులో అనసూయకు ధీటుగా ఆ పాత్ర ఉండబోతోన్నట్టు కనిపిస్తోంది.
ఓ వైపు వెండితెరపై ఇలా అవకాశాలు కొట్టేస్తోంది.. మరో వైపు బుల్లితెరరపై సీరియల్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. ఇంకో వైపు బుల్లితెరపై ప్రకటనల్లో నటిస్తూ నాలుగు చేతులా సంపాదిస్తోంది అర్చన. మొత్తానికి కార్తీకదీపం పుణ్యమా అని ఆర్టిస్ట్‌లందరూ కూడా తెగ బిజీగా అయిపోతున్నారు.