Karthika Deepam: కార్తీక దీపం డైరెక్ట‌ర్ ఎన్ని సీరియ‌ల్స్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడో తెలుసా?

Karthika Deepam: బుల్లితెర ఫేమ‌స్ సీరియ‌ల్ కార్తీక దీపం గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఏ రియాలిటీ షో, ఇత‌ర పాపుల‌ర్ షోస్ కూడా సాధించని రేటింగ్ కార్తీక దీపం సీరియ‌ల్‌కు వ‌స్తుంది. అశేష ప్ర‌జాద‌ర‌ణ ముందుకు సాగుతున్న కార్తీక దీపం సీరియల్ బుల్లితెర చరిత్రలో కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించిన కార్తీకదీపం మరో రికార్డ్‌కి చేరువైంది.ఇండియాలోనే నెంబర్ 1 టీఆర్పీ రేటింగ్ సాధించిన సీరియల్‌గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ నెంబర్ స్థానం కార్తీకదీపం సీరియల్‌కి ఇదే తొలిసారి కాదు. గ‌తంలోను నెంబ‌ర్ 1 స్థానాన్ని ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ ఈవారం 21. 01 టీఆర్పీ సాధించి తన రికార్డ్ తానే బ్రేక్ చేసుకుంది. అంతకు ముందు 20.07 ఉన్న టాప్ టీఆర్పీ రేటింగ్ బ్రేక్ అయ్యింది.

కార్తీక దీపం సీరియ‌ల్ ఇప్ప‌టికే 1058 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకోగా, మ‌రో వెయ్యి ఎపిసోడ్స్ ప్ర‌సార‌మైన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా సీరియల్ కు అడిక్ట్ అయిపోయారు. అనేక ట్విస్ట్‌లు, ప‌లు స‌ర్‌ప్రైజింగ్స్ న‌డుమ కార్తీక దీపం అప్ర‌తిహ‌తంగా ముందుకు సాగుతుంది. మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్‌తో దేశంలోనే నెంబర్ 1 సీరియల్‌గా నాలుగున్నర కోట్ల మంది వీక్షిస్తున్న ఇండియాలోనే నెం.1 టీవీ షోగా అవతరించి సెన్సేష‌న్ క్రియేట్ చేసింది కార్తీకదీపం సీరియల్. అయితే ఈ సీరియల్ ద‌ర్శ‌కుడు ఎవ‌రు అన్న‌ది చాలా మందికి తెలియ‌కపోవ‌చ్చు, ఆయ‌న ఎలా ఉంటాడో కూడా తెలియ‌దు. తాజాగా సీరియల్‌ లో కీ రోల్ ప్లే చేస్తున్న ప్రేమి విశ్వనాథ్‌ దర్శకుడు కాపుగంటి రాజేంద్రతో దిగిన ఫొటోను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

ప్రేమి షేర్ చేసిన పోస్ట్‌పై నెటిజ‌న్స్ భిన్న‌మైన కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ మోనిత గర్భవతి ఏంటండీ? అంటూ కోప్పడుతున్నారు. ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తారు. ఇంకో వెయ్యి ఎపిసోడ్‌లు తీస్తావా? ఏంటి.. ఆ దీప-డాక్టర్ బాబుల్ని కలిపేయవయ్యా డైరెక్టరూ.. మేం నాలుగు అక్షింతలు వేసి.. ఇంట్లో పప్పూ బువ్వ వండుకుని తినేస్తాం అని జనం గగ్గోలు పెడ‌తాం అని అంటున్నారు. మ‌రి ప్ర‌జ‌ల విన్నపాలు ద‌ర్శ‌కుడు ఆల‌కించి త్వ‌ర‌గా ముగింపు ప‌లుకుతాడా చూడాలి. కాపుగంటి రాజేంద్ర గతంలో అందం, బంగారు బొమ్మ సహా పలు సీరియల్స్ తో మంచి పేరు సంపాదించుకున్నాడు. పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు.