DHANUSH: అమెజాన్ ప్రైమ్ లో ధ‌నుష్ చిత్రం.. మోస్ట్ వ్యూస్ సాధించిన చిత్రంగా రికార్డ్ కొట్టేందుకు అడుగులు

ధనుష్ కొత్త సినిమా కర్ణన్ ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. మే 14న విడుదలైన ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా సినిమాను చూస్తున్నారు. కర్ణన్ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మారి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎప్రిల్ 9న విడుదలైంది. అయితే కరోనా కారణంగా అనుకున్న రీతిలో కలెక్షన్స్ రాలేదు. అయితే నెల రోజుల తర్వాత అమెజాన్ లో విడుదలైన ఈ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. నిజంగా చెప్పాలంటే ఇంత రెస్పాన్స్ వాళ్లు కూడా ఊహించలేదేమో..? చూస్తుంటే మోస్ట్ వ్యూస్ సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ రికార్డులను సైతం బద్దలు కొట్టేలా కనిపిస్తున్నాడు కర్ణన్.

మారి సెల్వరాజ్ ఈ చిత్రంలో చూపించిన పాయింట్ చాలా యూనిక్ గా ఉంది. అనగారిన జాతులను అగ్రవర్ణాలు ఎలా తమ కాళ్ల కింద చెప్పుల్లా చూస్తున్నాయి.. కనీసం ఊరికి బస్టాప్ కూడా లేకుండా అక్కడి వాళ్లను ఎంత హీనంగా చూస్తున్నారు.. కింద జాతి వాళ్లను ఎంత దారుణంగా హింసిస్తున్నారు.. వాళ్లను సమాజంలో ఎలా వెలేస్తున్నారు.. ఇలాంటి అంశాలను సినిమాలో చాలా చక్కగా ఆలోచనాత్మకంగా చూపించాడు మారి. హీరో పందులు పెంచుకునే వాళ్లింట్లో పుట్టి పెరుగుతాడు.. ఇదొక్కటి చాలు ధనుష్ ఎంత ధైర్యం చేసాడో చెప్పడానికి..? కింది జాతి వాళ్లను అగ్ర కులస్తులు ఎంత నీచంగా చూస్తారనేది ఈ చిత్రంలో చూపించాడు.

వాళ్లకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది.. ఒళ్ళు మండితే వాళ్లు కూడా ఏదైనా చేస్తారంటూ అందరి మనోభావాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు మారి సెల్వరాజ్. ఈ సినిమాకు IMDBలో కూడా 8.8 రేటింగ్ వచ్చింది. అలాగే ఇప్పుడు రెస్పాన్స్ కూడా అదిరిపోయింది. కచ్చితంగా ఇందులో నటనకు మరో నేషనల్ అవార్డు ధనుష్ కు గ్యారెంటీ అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏదేమైనా కూడా థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు కర్ణన్ సినిమా చూసి వారెవ్వా అంటున్నారు. దాంతో అమెజాన్ కూడా షేక్ అయిపోతుంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు లాల్ ఇందులో కీలక పాత్రలో నటించాడు.