Karina Kapoor : ఎన్టీఆర్, చరణ్ వల్లే నా కొడుకు అన్నం తింటున్నాడు.. స్టార్ హీరోయిన్ కామెంట్లు..!
NQ Staff - March 19, 2023 / 06:54 PM IST

Karina Kapoor : ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. నాటు నాటు సాంగ్ కు ఏకంగా ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సాంగ్ పాపులర్ అయిపోయింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టెప్పులు ఎంత అద్భుతంగా వచ్చాయో కూడా చూశాం.
ఒక రకంగా చెప్పాలంటే ఈ సాంగ్ కు ఇంత అద్భుతంగా డ్యాన్స్ చేసినందుకే ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఈ సాంగ్ గురించి తాజాగా కరీనా కపూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె బాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. నా చిన్న కొడుకు జహంగీర్ నాటు నాటు సాంగ్ పెడితేనే అన్నం తింటున్నాడు.
తెలుగులోనే..
రోజుకు ఎన్ని సార్లు పెట్టినా అదే సాంగ్ ను వింటాడు తప్ప బోరింగ్ గా ఫీల్ కావట్లేదు. ఒకవేళ ఆ సాంగ్ పెట్టకపోతే మారాం చేస్తున్నాడు. ఇంకో విషయం ఏంటంటే నాటు నాటు సాంగ్ కు అతను హిందీలో వినట్లేదు. అచ్చ తెలుగు లాంగ్వేజ్ లోనే వింటున్నాడు. అప్పుడే అతనికి మజా వస్తోంది.
అందుకే అతనికి తినిపించాలంటే నాటు నాటు సాంగ్ ను పెడుతున్నాం అంటూ చెప్పుకొచ్చింది కరీనా కపూర్. దాంతో ఆమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాటు నాటు సాంగ్ మొన్నటి వరకు దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రికెటర్లు కూడా ఈ సాంగ్ కు స్టెప్పులు వేస్తున్నారు.