బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులని అలరించిన ఈ ముద్దుగుమ్మ 2012లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఇది సైఫ్‌కు రెండో వివాహం. 2016లో ఈ దంపతులు తైమూర్‌కు జన్మనివ్వగా, ఈ బుడతడు చిన్నప్పుడే సెలబ్రిటీగా మారాడు. తైమూర్ ఫొటో ఒకటి బయటకు వచ్చిందంటే అది కొద్ది క్షణాలలో ఫుల్ వైరల్ అయ్యేది. కేరళ, తమిళనాడు ప్రాంతాలలో కొన్ని షాపులకు తైమూర్ పేరు కూడా పెట్టారంటే చిన్నారిపై వారికున్న అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ ఏడాది కోహ్లీ- అనుష్క దంపతులు ఆడపిల్లకు జన్మినవ్వగా, కరీనా-సైఫ్ దంపతులు ఎవరికి జన్మినిస్తారనే ఆసక్తి అందరిలో ఉంది. గత ఏడాది ఆగస్ట్‌లో కరీనా కపూర్ తాను ప్రగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించగా, ఫిబ్రవరి 15,2021న డెలివరీ డేట్ ప్రకటించారు. అయితే ఆ డేట్ క్రాస్ అయిన కరీనాకు పెయిన్స్ రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో కరీనా కపూర్ అడ్మిట్ చేయగా, ఆదివారం ఆమె మగబిడ్డకు జన్మినచ్చినట్టు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కరీనా మళ్ళీ మగబిడ్డకు జన్మనిచ్చిందనే విషయం తెలుసుకున్న నెటిజన్స్ , సెలబ్రిటీస్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తల్లి,బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. మరో మూడు నాలుగు రోజులలో వారిని డిశ్చార్జ్ చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా, కరీనా గర్భవతిగా ఉన్నప్పుడు కూడా పలు యోగసనాలు చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్ ను అలరించింది. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తుంది కరీనా. ఈ మూవీలో పాల్గొన్న కరీనా కొన్ని కీలక సన్నివేశాలు చేసింది. ప్రెగ్నెన్సీ నేపథ్యంలో షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన కరీనా త్వరలో సెట్స్ లో జాయిన్ కానున్నారు.