Karate Kalyani : నన్ను వ్యభిచారిలా చూస్తున్నారు: కరాటే కళ్యాణి ఆవేదన.!
NQ Staff - December 31, 2022 / 10:42 AM IST

Karate Kalyani : సినీ నటి కరాటే కళ్యాణి తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో వుంటూ వస్తుంది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి సినీ రంగం వైపు ఆకర్షితురాలైన కరాటే కళ్యాణి, సినిమాలే కాకుండా నాటకాలు.. హరికథలు.. హిందూ మతానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలతో పాపులర్ అయ్యింది.
కొన్నాళ్ళ క్రితం బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా కూడా అదనపు ఫేమ్ సొంతం చేసుకుంది. అయినా గానీ, ఆమెను ఇంకా చాలా మంది వ్యభిచారిలానే చూస్తున్నారట.
ఆ ప్రభావం వల్లే..
సినిమాల్లో చేసిన పాత్రల ప్రభావం వల్ల నా మీద ‘వ్యభిచారి’ అనే ముద్ర వేస్తున్నారు కొందరు.. ఇది అత్యంత బాధాకరం.. అంటూ వాపోయింది కరాటే కళ్యాణి తాజాగా. ‘అలాంటి మాటలు విన్నప్పుడు చాలా చాలా బాధగా వుంటుంది. నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తాను.. పురాణాలపై సంపూర్ణ అవగాహన వుంది.. ఇవేవీ జనం గుర్తించరు’ అంటూ కన్నీరు మున్నీరయ్యింది కరాటే కళ్యాణి.
సినిమాల్లో పాత్రలు వేరు.. తారల వ్యక్తిగత జీవితాలు వేరు.. నటన నా వృత్తి, ప్రవృత్తి.. సినిమాల్లో మంచి పాత్రల కంటే చెడ్డ పాత్రలకే గుర్తింపు.. అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.
ఓ సినిమాలో బ్రహ్మానందంతో ‘బాబీ..’ అంటూ ఆమె వ్యాంపు తరహాలో చెప్పే డైలాగ్.. ఆమెకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అదే ఆమెపై ‘వ్యభిచారి’ అనే ముద్ర పడటానికీ కారణం.