Pawan Kalyan: కాపు సెల‌బ్రిటీల మ‌ధ్య ప‌వ‌న్ బ‌ర్త్ డే వేడుక‌.. చ‌ర్చ‌నీయాంశంగా మార‌నున్నసెల‌బ్రేష‌న్స్

Pawan Kalyan: అభిమానులు ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. ప‌వ‌ర్ ప‌వన్ క‌ళ్యాణ్ నేడు 50వ బ‌ర్త్ డే జ‌రుపుకోనుండ‌గా, ఆయ‌న బ‌ర్త్‌డేకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీ అభిమానులు, జ‌న‌సైనికులు భారీ ఎత్తున బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొనబోతున్న‌ట్టు తెలుస్తుంది. సెల‌బ్రిటీలు త‌మ‌సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్‌కు శుభాకాంక్ష‌ల వెల్లువ కురిపిస్తున్నారు.


Kapu Celebrities for Pawan's Birthday Celebrations
Kapu Celebrities for Pawan’s Birthday Celebrations


ప‌వన్ బర్త్ డేను ఈసారి కాపు సంక్షేమ సేన నిర్వహించబోతోంది. ఈ మేరకు మీడియాకు పత్రికా ఆహ్వానం కూడా పంపబడింది. ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ ఉదయం 9:30 గంటలకు ఈ వేడుకలు జరుగనున్నాయి. ముఖ్య అతిధులుగా ద‌ర్శ‌కుడు మారుతి, ఆర్కే నాయుడు హాజ‌రు కానున్నారు. కాపు సంక్షేమ సేన వీరితో పాటుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులను కూడా ఆహ్వానించిందని తెలుస్తోంది.


అయితే ఎన్న‌డు లేని విధంగా ప‌వ‌న్ బ‌ర్త్ డే వేడుక‌ల‌ను సామాజిక వ‌ర్గ సంస్థ నిర్వ‌హించ‌డం హాట్ టాపిక్‌గా మారింది. అదీకాక ఈ వేడుకకు కులానికి చెందిన సెల‌బ్రిటీలు హాజ‌రుకానుండ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధార‌ణంగా కులానికి సంబంధించిన వేడుక‌కి రావ‌డానికి సెల‌బ్రిటీలు పెద్ద‌గా ఆస‌క్తి చూపరు. ఇప్పుడు పవన్ బర్త్ డే ఓ వర్గానికి చెందిన వారందని దగ్గర చేయనుంది.


ప‌వ‌న్ బ‌ర్త్ డేని కాపు సంక్షేమ సేన నిర్వ‌హిస్తే జ‌న‌సైనికుడిపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుందా అనే కామెంట్స్ వ‌స్తున్నాయి. అయితే ప‌వ‌న్ మొదటి నుండి తాను కుల‌, మ‌తాల‌కు అతీతం అని చెబుతూ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అభిమానులు కాస్త అత్యుత్సాహంతో ఇలా చేయ‌డాన్ని కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. ఇప్పుడు ప‌వ‌న్‌ని చూసి మిగ‌తా హీరోల క్యాస్ట్ వారు రానున్న రోజుల‌లో సెల‌బ్రేష‌న్స్ ఏర్పాటు చేస్తారా అన్న‌ది తెలియాల్సి ఉంది.