VAKEEL SAAB: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..బుధ‌వారం రోజు వ‌కీల్ సాబ్ నుండి మ‌రో స‌ర్‌ప్రైజ్

VAKEEL SAAB రెండేళ్ల గ్యాప్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన చిత్రం వ‌కీల్ సాబ్. హిందీలో మంచి విజ‌యం సాధించిన పింక్ రీమేక్‌గా వ‌కీల్ సాబ్ చిత్రాన్ని తెర‌కెక్కించారు వేణు శ్రీరామ్. తెలుగు నేటివిటీకి అనుగుణంగా రూపొందిన వ‌కీల్ సాబ్ చిత్రాన్ని ఏప్రిల్ 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్ప‌టికే సినిమా నుండి విడుద‌లైన మ‌గువా మ‌గువా , స‌త్య‌మేవ జ‌యతే అనే సాంగ్స్ శ్రోత‌ల‌ని ఎంతో అల‌రింప‌జేయ‌గా, మార్చి 17 సాయంత్రం 5గం.ల‌కు కంటి పాప కంటి పాట అనే ప‌ల్లవితో సాగే పాట‌ను విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

‘వకీల్ సాబ్’ చిత్రాన్ని దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా, ఇందులో శృతి హాసన్ కథానాయిక. అంజలి, నివేధా థామస్, అనన్య నాగళ్ళ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీలో విమెన్ ఎమ్‌పవర్‌మెంట్ కోసం పోరాడే లాయర్‌గా సరికొత్తగా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యాన్స్‌కు మాంచి కిక్ ఇచ్చే చిత్రంగా వ‌కీల్ సాబ్ చిత్రాన్ని రూపొందించిన‌ట్టు తెలుస్తుంది. ‘వకీల్ సాబ్’ చిత్రానికి థమన్ సంగీతం, పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Advertisement