Kanthara : తెలుగునాట ‘కాంతారా’ మోత మోగిపోతోంది.! సూపర్ డూపర్ హిట్టే.!

NQ Staff - October 16, 2022 / 09:12 AM IST

Kanthara : తెలుగునాట ‘కాంతారా’ మోత మోగిపోతోంది.! సూపర్ డూపర్ హిట్టే.!

Kanthara : రిషబ్ షెట్టి నటించిన కన్నడ సినిమా ‘కాంతారా’ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సినిమా చూసినోళ్ళంతా ‘సూపర్ డూపర్ హిట్’ అనేస్తున్నారు. ఈ మధ్య ఇలా వచ్చిన సినిమాలు చాలావరకు సంచలన విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే.
‘కేజీఎఫ్’, ‘విక్రమ్’ తదితర డబ్బింగ్ సినిమాలు, తెలుగు నాట సరికొత్త రికార్డుల్ని సృష్టించాయి.

ఆ లిస్టులో ‘కాంతారా’ కూడా చేరిపోయేలా వుంది. ‘కేజీఎఫ్’ భారీ బడ్జెట్ సినిమా. ‘విక్రమ్’ కూడా అంతే. పైగా, వాటికి స్టార్ వాల్యూ వుంది. రిషబ్ శెట్టి ‘కాంతారా’ వ్యవహారం వేరే.! వసూళ్ళు అదిరిపోతున్నాయ్.. ‘కాంతారా’ సినిమాకి మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఇద్దరు సినీ అభిమానులు మాట్లాడుకున్నా, వారి మాటల్లో ‘కాంతారా’ ప్రస్తావన వస్తోంది. దాంతో, సాయంత్రానికే కొన్ని చోట్ల థియేటర్ల సంఖ్య పెరగడం కనిపించింది.

మరోపక్క, రేపు మరిన్ని థియేటర్లను యాడ్ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ‘చివరి ఇరవై ఐదు నిమిషాలు అద్భుతం..’ అన్న టాక్, సినిమా పట్ల ప్రేక్షకులు ఆకర్షితులవడానికి కారణంగా చెప్పుకోవచ్చేమో. రొటీన్‌కి భిన్నంగా వస్తోన్న సినిమాలు తెలుగు నాట బాగా తగ్గిపోవడంతో, డబ్బింగ్ సినిమాల్ని స్ట్రెయిట్ సినిమాల తరహాలో తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us