Kanta Rao : ఇండ‌స్ట్రీలో మ‌రో విషాదం.. మేటి నటుడి స‌తీమ‌ణి క‌న్నుమూత‌

Kanta Rao : గ‌త ఏడాది సినీ పరిశ్ర‌మ‌లో ఎన్ని విషాద సంఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎంతో మంది లెజండ‌రీ న‌టీనటులు, స్టార్ డైరెక్ట‌ర్స్, ఫేమ‌స్ కొరియోగ్రాఫ‌ర్స్ తుదిశ్వాస విడిచారు. వారి విషాదం సినీ అభిమానుల‌కు తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఏడాదైన అలాంటి చెడు విష‌యాలు త‌మ చెవిన ప‌డకూడ‌ద‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు. అయితే ఈ రోజు మ‌ధ్యాహ్నాం అల‌నాటి అందాల న‌టుడు కాంతారావు స‌తీమ‌ణి హైమావ‌తి(87) క‌న్నుమూశారు.

హైద‌రాబాద్‌లోని మ‌ల్లాపూర్‌లో హైమావ‌తి ఉంటుండ‌గా, ఈ రోజు మ‌ధ్యాహ్నాం ఆమెకు గుండెపోటు రావ‌డంతో క‌న్నుమూశారు.ఆయ‌న మృతికి చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేశారు. రేపు సాయంత్రం హైమావ‌తి భౌతిక కాయానికి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, కాంతారావు, హైమావ‌తి దంప‌తుల‌కు న‌లుగురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 1951లో కాంతారావు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌గా, 2003లో చివ‌రిగా క‌నిపించారు. 2009 మార్చి 22న క్యాన్సర్‌ వ్యాధితో మరణించారు.

Advertisement