Kannada Heroes Anger On Prashanth Neel : ప్రశాంత్ నీల్ మీద భగ్గుమంటున్న కన్నడ హీరోలు.. రాజమౌళిని చూసి నేర్చుకోవాలంట..!
NQ Staff - August 18, 2023 / 02:10 PM IST

Kannada Heroes Anger On Prashanth Neel :
ప్రశాంత్ నీల్.. సినిమా తీస్తే ఇండియన్ బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే. హై ఓల్టేజ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయాడు ఆయన. చేసింది ఇప్పటి వరకు మూడు సినిమాలే. కానీ అందులో కేజీఎఫ్-1, కేజీఎఫ్-2 సినిమాలు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బాక్సాఫీస్ కు సరికొత్త నటన, డైలాగులు, సీన్లను రుచి చూపించాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ రెండు సినిమాలు చేసింది హీరో యష్ తోనే. అంతకు ముందు చేసిన మొదటి సినిమా కూడా కన్నడ హీరోతోనే చేశారు. కానీ ఇప్పుడు ఆయన రూటు మార్చేశారు.
వరుసగా పాన్ ఇండియా స్టార్లు అయిన ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాలను లైన్ లో పెట్టేశారు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మొదటి పార్టును కంప్లీట్ చేశారు. వచ్చే నెలలో ఇది రిలీజ్ కు రెడీగా ఉంది. దాని తర్వాత పార్ట్-2 కూడా ఉండబోతోంది. అది కంప్లీట్ కావడానికి మరో రెండేళ్లు పట్టేలా ఉంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా ఉంది. అది ఎన్ని పార్టలుగా వస్తుందో తెలియదు. అంటే మరో నాలుగు, ఐదేండ్ల వరకు ప్రశాంత్ నీల్ కు ఖాళీ లేదు. దాంతో కన్నడ స్టార్ హీరోలు ఆయనప రుసరుసలాడుతున్నారంట. ఎందుకంటే కన్నడ డైరెక్టర్ అయి ఉండి తమతో సినిమాలు ఎందుకు చేయట్లేదనే కోపం వారిలో ఉంది.
అసలే కన్నడలో ట్యాలెంట్ ఉన్న డైరెక్టర్లు చాలా తక్కువ. కాబట్టి ఉన్న పెద్ద డైరెక్టర్ కూడా తమను పట్టించుకోకుండా తెలుగు హీరోలతో సినిమాలు చేయడం ఏంటని వారు మండి పడుతున్నారు. రాజమౌళి కూడా చాలా పెద్ద డైరెక్టర్. ఆయన తలుచుకుంటే బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేయొచ్చు. కానీ ఆయన అలా చేయట్లేదు. కేవలం తెలుగు హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తున్నారు. తన సినిమాలతో తెలుగు హీరోల మార్కెట్ ను, క్రేజ్ ను పెంచేస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా తెలుగు హీరోలతోనే సినిమాలు చేస్తే తమ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు కన్నడ హీరోలు.

Kannada Heroes Anger On Prashanth Neel
ఒకవేళ రాజమౌళి గనక ఇతర ఇండస్ట్రీ హీరోలతో సినిమాలు చేస్తే తెలుగు హీరోలు పాన్ ఇండియా స్టార్లు అయ్యే వారా అని మండిపడుతున్నారు. కేవలం కన్నడ హీరోలే కాదు.. కన్నడ సినిమా ప్రేక్షకులు కూడా ఇదే విషయంలో ప్రశాంత్ నీల్ ఉన నిలదీస్తున్నారు. రాజమౌళి తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లినట్టు.. ప్రశాంత్ నీల్ కూడా కన్నడ ఇండస్ట్రీ రేంజ్ ను పెంచుతారని ఆశ పడితే అడియాశలు మిగులుతున్నాయి కన్నడ హీరోలకు.
ఇంకో విషయం ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా కూడా మరో తెలుగు హీరోతోనే ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే కంటిన్యూ అయితే ప్రశాంత్ నీల్ తెలుగు ఇండస్ట్రీకే అంకితం అయిపోతాడని కామెంట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే ఇక ప్రశాంత్ నీల్ మీద కన్నడ ప్రేక్షకులు ఆశలు పెట్టుకోవద్దని సోషల్ మీడియాలో పోస్టులు కూడా వెలుస్తున్నాయి.