Kangana: గాంధీని పరోక్షంగా విమ‌ర్శించిన కంగనా.. ఎందుకంత ధైర్యం

Kangana: కంగనా రనౌత్ ఈ మ‌ధ్య వివాదాస్పద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల‌లో నిలుస్తుంది. దేశ స్వాతంత్ర్యం పై నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై అనేక మంది మండి ప‌డ్డారు.ప‌ద్మ‌శ్రీని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014లోనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చిందని వ్యాఖ్యానించి వార్త‌ల‌లోకి ఎక్కింది.

TheNewsQube-
kangana shocking comments2
kangana shocking comments2

కంగనా చేసిన విమ‌ర్శ‌లు చ‌ల్లార‌క ముందే మ‌రో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నేనింతే అంటున్నారు కంగనా రనౌత్. ”ఒక చెంప చూపితే స్వాతంత్య్రం రాదని, భిక్ష మాత్రమే వస్తుందని” అంటూ తాజాగా ఆమె పరోక్షంగా మహాత్మా గాంధీని ఆమె విమర్శించారు. అంతేకాదు.. సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌కు గాంధీ మద్దతు ఇవ్వలేదని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

బోస్‌.. దేశంలో అడుగుపెడితే ఆయనను అప్పగించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ, మొహమ్మద్‌ అలీ జిన్నాతో కలిసి గాంధీ ఓ బ్రిటిష్‌ జడ్జితో ఒప్పందం కుదుర్చుకున్నారు. మనం నేతాజీ లేదా గాంధీ ఇద్దరిలో ఒకరికి మాత్రమే అభిమానులుగా ఉండగలం. ఇద్దరినీ అభిమానించలేమని ఆమె తన పోస్ట్ లో వ్యాఖ్యానించారు.

స్వాతంత్య్ర కోసం పోరాడాలన్న కాంక్ష, ధైర్యం ఆ పిరికివారిలో లేవు. వారెప్పుడూ అధికారం కోసం పాకులాడిన గుంటనక్కలు అంటూ తీవ్రమైన పదాలు వాడారు తన పోస్ట్ లో. దీనితో పాటు భగత్‌ సింగ్‌ను ఉరితీయాలని గాంధీ కోరుకున్నట్లు సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి అంటూ కంగనా వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. నిజమైన వీరులెవరో ప్రజలు గుర్తించాలని ఆమె కోరారు.

kangana shocking comments1
kangana shocking comments1

ఏటా నిజమైన యోధుల జయంతి, వర్ధంతి రోజు మాత్రమే వారిని స్మరించుకోరాదని, ఏడాదిలో రెండు రోజులు వారిని స్మరించుకొని మిగతా రోజులు పట్టించుకోకపోవడం బాధ్యతారహితమని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు