Kangana Ranaut : పిల్లల్ని కనాలంటే పెళ్లి అవసరం లేదు.. కంగనా రనౌత్ సంచలనం..!
NQ Staff - June 18, 2023 / 02:06 PM IST

Kangana Ranaut : ట్రెండ్ మారుతోంది. మన దేశంలో కూడా విదేశీ కల్చర్ ఎంట్రీ ఇస్తోంది. వాస్తవానికి పిల్లల్ని కనాలంటే కచ్చితంగా పెళ్లి చేసుకోవాలన్నది మన దేశ కల్చర్. కానీ సినీ తారలు మాత్రం దీన్ని బ్రేక్ చేస్తున్నారు. పెళ్లికి ముందే డేటింగ్ పేరుతో ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు పెళ్లికి ముందే పిల్లల్ని కనేస్తున్నారు. పెళ్లి కాకుండా తల్లులు అవుతున్నారు.
ప్రస్తుతం ఇలియానా కూడా ఇదే పని చేస్తోంది. ఆమె ఇప్పుడు నిండు గర్భిణి. కానీ ఆమెకు పెళ్లి కాలేదు. భర్త లేకుండానే పిల్లల్ని కంటోంది. మొన్న సీనియర్ నటి టబు కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. తాను కూడా భర్త లేకుండానే పిల్లల్ని కంటానని చెబుతోంది. ఇప్పుడు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ఇదే లిస్టులోకి వచ్చేసింది.
కంగనా రనౌత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్లు చేసింది. నాకు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలనే కోరిక ఉంది. కానీ మన తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది. కల్చర్ మారుతోంది. పిల్లల్ని కనాలంటే పెళ్లి అవసరం లేదని చాలామంది నిరూపిస్తున్నారు. నేను కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాను.
పిల్లల్ని కనాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు అయినా వర్తిస్తుంది. వారి ఇష్టాను సారంగా వారు ముందుకు వెళ్తారు. అందులో ఎలాంటి తప్పులేదు అంటూ బోల్డ్ కామెంట్లు చేసింది కంగనా. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.