Kangana Ranaut : ఆ సినిమా కోసం తన సర్వం తనఖా పెట్టిందట!
NQ Staff - January 21, 2023 / 07:00 PM IST

Kangana Ranaut : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూనే స్వీయ దర్శకత్వంలో కంగనా నిర్మించింది. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున రాజకీయ సంచలనాలు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా వేలాది మంది రాజకీయ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని అపవాదు ఉంది.
ఆనాటి సంఘటనలన్నీ కూడా ఎమర్జెన్సీ సినిమాలో కంగనా రనౌత్ చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. షూటింగ్ పూర్తి చేసినట్లు కంగనా అధికారికంగా ప్రకటించింది. నా జీవితంలోని అద్భుతమైన ఘట్టం చివరి దశకు చేరుకుంది, ఈ సినిమా కోసం ఎలాంటి ఇబ్బంది పడలేదని కొందరు భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు.
నాకు సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా తనఖా పెట్టాల్సి వచ్చింది. మొదటి షెడ్యూల్ సమయంలో డెంగ్యూ బారిన పడ్డాను, రక్త కణాలు చాలా తగ్గినప్పటికీ షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చింది. ఇంకా సంక్లిష్టమైన పరిస్థితుల్లో సినిమా కోసం నటించానంటూ కంగనా చెప్పుకొచ్చింది.
ఎమర్జెన్సీ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదల సమయంలో కాస్త హడావుడి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ సినీ విశ్లేషకులు మరియు రాజకీయ నాయకుల అభిప్రాయం చేస్తున్నారు. బిజెపి వారి మద్దతు కోసమే కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమాను చేస్తుందంటూ కొందరు విమర్శిస్తున్నారు.